• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీఎం నివాసం శత్రుధుర్భేధ్యం.!నిరసనలకు చెక్!ప్రగతిభవన్ ఎదుట ప్రత్యేక ఇనుప కంచె ఏర్పాటు.!

|

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అధికారిక నివాసం ప్రగతి భవన్ ఇప్పుడు శత్రు ధుర్భేద్యంగా మారిపోయింది. శత్రువు తొంగిచూడలేనంత పకడ్బంధీగా ప్రగతిభవన్ రక్షణకు అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకు తగ్గట్టే ప్రగతి భవన్ చుట్టూ అష్టదిగ్భంధనం దిశగా చర్యలు చేపట్టారు భధ్రతాదికారులు. తాజాగా ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రధాన ద్వారం ఎదురుగా, రహదారి మీద ప్రగతి భవన్ వైపు వచ్చేందుకు వీలు లేకుండా ప్రత్యేక ఇనుప కంచెను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సీఎం అధికారిక నివాసం ముట్టడి వంటి కార్యక్రమాలకు చెక్ పెట్టారు సీఎం ప్రత్యేక భద్రతాదికారులు.

ఆందోళన కారులు కల్వకుంట.. సీఎం నివాసం ఎదుట ఇనుప కంచే ఏర్పాటు..

ఆందోళన కారులు కల్వకుంట.. సీఎం నివాసం ఎదుట ఇనుప కంచే ఏర్పాటు..

సీఎం అధికారిక నివాసం ఐన ప్రగతి భవన్ కు భద్రతను మరింత కట్టుదిట్టం చేసారు అధికారులు. ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న రోడ్డు మీద ఇనుపకంచెను నిర్మించి రోడ్డు దాటే వెసులుబాటును నిషేదించారు. సీఎం నివాస ప్రాంగణం కావడంతో సహజంగానే భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది, చీమ చిటుక్కుమన్నా ఉలిక్కిపడి అప్రమత్తమయ్యే యంత్రాంగం నిత్యం గస్తీ కాస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రదేశంలోకి ఎవ్వరిని రానివ్వకుండా నిషేదాజ్ఞలు కూడా అమలులో ఉంటాయి. కాని ప్రగతి భవన్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉండడంతో భద్రత విషయంలో కొన్ని అదనపు చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు.

అష్ట దిగ్భంధనం.. ఎవ్వరూ తొంగిచూడని విధంగా ప్రగతి భవన్ భద్రత..

అష్ట దిగ్భంధనం.. ఎవ్వరూ తొంగిచూడని విధంగా ప్రగతి భవన్ భద్రత..

ప్రగతిభవన్ గా పిలువబడే సీఎం అధికారిక నివాసం నుండే ప్రస్తుతం పరిపాలన కొనసాగిస్తున్నారు ముఖ్యమంత్రి. మంత్రివర్గ సమావేశాల దగ్గరనుండి బ్యూరోక్రాట్ల రివీవ్ మీటింగుల వరకూ అన్ని కార్యక్రమాలు ప్రగతిభవన్ నుండే కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులు సైతం ప్రగతి భవన్ నుండే నిర్వహించబడుతున్నాయి. ఇంతటి సౌకర్యవంతమైన సీఎం అధికారికి నివాసానికి సరైన భద్రతను కల్పించాలని, ప్రస్తుతం ఉన్న భద్రత కాకుండా అదనంగా మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని పోలీసు ఉన్నతాదికారులు భావించినట్టు తెలుస్తోంది.

ప్రగతిభవన్ ముట్టడి.. ఇక కష్టమే..

ప్రగతిభవన్ ముట్టడి.. ఇక కష్టమే..

ప్రభుత్వ విధానాలపై కొన్ని వర్గాల ప్రజల నుండి విమర్శలు ఎదురవ్వడం సర్వసాధారణం. ప్రభుత్వం విధానాలు నచ్చక నిరసనలు, దీక్షలు, ధర్నాలు, ముట్టడి వంటి కార్యక్రమాలు ఆందోళన కారుల ద్వారా చోటుచేసుకుంటాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలనో, ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చాలనో, ఏకపక్షంగా ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలనో ఈ నిరసన కార్యక్రమాలకు పాల్పడుతుంటారు బాదితులు. ఒక్కోసారి సీఎం అధికారిక నివాసాన్ని ముట్టడించి సమస్య తీవ్రతను చాటి చెప్పాలనుకుంటారు ఆందోళనకారులు. ఇలాంటి సంఘటనలకు చెక్ పెట్టేందుకు ప్రగతిభవన్ ఎదురుగా మెయిన్ రోడ్ మీద ఎనిమిది అడుగుల ఎత్తైన ప్రత్యేక ఇనుప కంచెను నిర్మిస్తున్నారు భద్రాతాదికారులు.

  Green Fungus Symptoms ముక్కు నుంచి రక్తం , తీవ్ర జ్వరం | Prevention | Black Fungus | Oneindia Telugu
  ఇలాంటి చర్యలు పునరావృతం కావొద్దంటున్న పోలీసులు..

  ఇలాంటి చర్యలు పునరావృతం కావొద్దంటున్న పోలీసులు..

  గతంలో పోలీసుల కళ్లుగప్పి ప్రగతి భవన్ ముట్టడించిన రేవంత్ రెడ్డి.. ఇలాంటి చర్యలు పునరావృతం కావొద్దంటున్న పోలీసులు..
  గతంలో ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఛేదించుకుని, ప్రగతిభవన్ ప్రధాన గేట్ పైకి ఎక్కే ప్రయత్నం చేసారు. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన పోలీసులు రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నగరం అంతా జల్లెడ పట్టి కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నప్పటి పోలీసుల కళ్లుగప్పి రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ చేరుకోవడం అప్పట్లో సంచలనంగా మరింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రగతి భవన్ చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేసారు పోలీసులు. దీంతో ప్రత్యేక ఇనుప కంచెలను నిర్మిస్తూ చీమలు దూరేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు పోలీసులు.

  English summary
  Authorities are erecting a special iron fence in front of the main entrance of the Chief Minister's official residence to prevent access to the Pragati Bhavan on the road. With this, the CM's special security guards checked for activities like the siege of the CM's official residence.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X