కేసీఆర్ కు సీఎం రేవంత్ భారీ జలక్ - మళ్లీ మొదలు..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరోసారి రేవంత్ ఆపరేషన్ బీఆర్ఎస్ ప్రారంభించారు. గులాబీ పార్టీ నేతలను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేసారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీ ఇవ్వటంతో పాటుగా ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. దీంతో, భవిష్యత్ పరిణామాల పైన రేవంత్ అలర్ట్ అయ్యారు. అందులో భాగంగా గులాబీ పార్టీ నేతలను స్వయంగా తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేత పోచారం శ్రీనివాస రెడ్డిని కలిసి కాంగ్రెస్ లోకి రావాలని స్వయంగా ఆహ్వానించారు. మంత్రి పొంగులేటితో కలిసి రేవంత్ నేరుగా పోచారం ఇంటికి వెళ్లారు. నిజామాబాద్ లో సీనియర్ నేతగా ఉన్న పోచారం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్పీకర్ గా పని చేసారు. అసెంబ్లీలోని గులాబీ పార్టీ తరపున తన వాయిస్ వినిపించారు. రాష్ట్రం లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ లోగానే ఆపరేషన్ బీఆర్ఎస్ పూర్తి చేయాలనేది రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది.

పోచారం గతంలో టీడీపీలో పని చేసారు. ఆ తరువాత బీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ ప్రభుత్వంలో స్పీకర్ గా, వ్యవసాయ శాఖ మంత్రిగా వ్యవహరించారు. నిజామాబాద్ జిల్లాలో సీనియర్ నేతగా ఉన్నారు. ఇప్పుడు పోచారం పార్టీలోకి వస్తే రాజకీయంగా జిల్లాలో పట్టు పెరుగుతుందని..బీఆర్ఎస్ బలహీనపడుతుందని కాంగ్రెస్ లెక్కలు వేస్తోంది. గలాబీ పార్టీకి చెందిన మరో ఏడుగురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. వీరిని ఒకే వేదిక మీద పార్టీలోకి ఆహ్వానించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, సీఎం రేవంత్ స్వయంగా తన ఇంటికి వచ్చి ఆహ్వానించటంతో పోచారం ఇక కాంగ్రెస్ లో చేరటం లాంఛనంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications