రిజర్వేషన్ల పై రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం, ఇక నుంచి..!?
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొంత కాలంగా బీసీ రిజర్వేషన్ల అమలు పైన తర్జన భర్జన కొనసాగుతోంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇదే అంశం పైన సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల కోటా పరిమితి ఎత్తివేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ కోసం ప్రత్యేక జీఓలు జారీ చేసేందుకు సిద్ధం అవుతుంది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285(A)ను సవరణ చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తొలి రోజు సమావేశం వాయిదా తరువాత రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 285(A) లో సవరణలు చేయాలని నిర్ణయించింది. ఈ సవరణతో బీసీ వర్గాలకు పంచాయతీ రాజ్ ఎన్నికలలో అధిక రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉంటుంది. ఈ సవరణ ద్వారా, బీసీ వర్గాలు ప్రాతినిధ్యం పెంచుకొని, వారికి మరింత స్థానం, అధిక అవకాశాలు కల్పించడానికి అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు.

ఇక, రాష్ట్ర ప్రభుత్వం 50% సీలింగ్‌ను సడలించేందుకు చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టే నిమిత్తం ప్రణాళికలతో సిద్దం అయింది. దీని ద్వారా రిజర్వేషన్ల కోటా పరిమితిని నెమ్మదిగా పెంచే వెసులుబాటు కలుగుతుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న 50% రిజర్వేషన్ సీలింగ్ (పరిమితి) ను తొలగించడం ద్వారా, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మరిన్ని అవకాశం దక్కతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఆర్డినెన్స్ కు ఆమోదం లభించకపోవడంతో, జీవో (గవర్నమెంట్ ఆర్డర్) ద్వారా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని రేవంత్ నిర్ణయించారు.ఈ జీవో ద్వారా, కొత్త రిజర్వేషన్ విధానాన్ని త్వరలో అమలుకు సిద్దమైంది. అసెంబ్లీ వేదికగా బిల్లు ప్రవేశ పెట్టి.. ప్రభుత్వం ఇతర పక్షాలను చర్చలో భాగస్వాములను చేయనుంది. సభలోనే సీఎం రేవంత్ కీలక ప్రకటన చేయనున్నారు.












Click it and Unblock the Notifications