ప్రధాని మోదీ మనసు గెలిచిన రేవంత్ - కేసీఆర్ ను ఫిక్స్ చేసేలా..!!
సీఎం రేవంత్ లౌక్యం ప్రదర్శించారు. ప్రధాని పర్యటన వేళ సమయస్పూర్తిగా వ్యవహరించారు. కేసీఆర్ ఎక్కడ పొరపాటు చేసారో..తన హాయంలో అది జరగకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రం కోసం రాజకీయాలను పక్కన పెడదామని చెప్పారు. ప్రధాని రాష్ట్రాలకు పెద్దన్నగా అభివర్ణించారు. మోదీ ఆశీస్సులుంటే తెలంగాణ గుజరాత్ లాగా అభివృద్ధి చేస్తామని రేవంత్ చెప్పకొచ్చారు. రేవంత్ చేసిన అభ్యర్దన కు ప్రధాని సానుకూలంగా స్పందించారు.
ప్రధానితో రేవంత్: ప్రధాని పర్యటనను సీఎం రేవంత్ సద్వినియోగం చేసుకున్నారు. తొలుత బీజేపీతో సఖ్యతగా వ్యవహరించిన మాజీ సీఎం కేసీఆర్ తరువాతి కాలంలో మోదీని టార్గెట్ చేసి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే రేవంత్ కు పూర్తి అవగాహన ఉంది. దీంతో, తాను సీఎం అయిన తరువాత ఢిల్లీ పర్యటనలోనూ ప్రధాని మోదీని కలిసారు.

కేంద్రం- రాష్ట్రం మధ్య పాలనా పరంగా సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీని ఆకట్టుకొనే విధంగా వ్యవహరించారు. ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం కోరిన విధంగా ఐపీఎస్ లు కేటాయింపు, కంటోన్మెంట్ లో ప్రభుత్వం కోరిన స్థలం కేటాయించారు. ఇప్పుడు రేవంత్ సీఎం అయిన తరువాత మోదీ తొలి సారి రాష్ట్రానికి వచ్చారు. ప్రధానికి స్వాగతం కోసం రేవంత్ అధికారికంగా స్వాగతం పలికారు.
మోదీ అవసరం గుర్తించి: ప్రధానితో కలిసి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అదే వేదిక నుంచి ప్రధానితో తాను సీఎంగా ఏ విధమైన సంబంధాలు కోరుకుంటున్నదీ వివరించారు. రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకెళ్తామన్నారు. కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో గుజరాత్ లా తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని రేవంత్ ప్రధానిని కోరారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణకు ఇప్పుడు అందిస్తున్న విధంగానే సహకారం అందించాలని కోరారు. రేవంత్ తన ప్రసంగంలో ప్రధాని మోదీని ఎక్కడా నొప్పించకుండా...పూర్తిగా తన లక్ష్యాలు చేరుకొనేందుకు ఒప్పించే విధానంలోనే ప్రసంగించారు.

నొప్పించక..మెప్పించేలా: రేవంత్ ప్రసంగం తరువాత సీఎంకు ప్రధాని మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించారు. తన ప్రసంగంలో తెలంగాణ సీఎం కోరిన విధంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. గతంలో రాజకీయంగా విభేదించిన తరువాత ప్రధాని తెలంగాణకు వచ్చిన సమయంలో సీఎంగా కేసీఆర్ ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు.
దీనిని బీజేపీ నేతలు అవమానంగా భావించారు. ఫలితంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినవి దక్కించుకోవటంలో విఫలమయ్యారు. ఎన్నికల సమయంలోనూ ఆ ప్రభావం పడింది. ఇవన్నీ చూసిన సీఎం రేవంత్..భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రధానితో సీఎంగా రేవంత్ వ్యవహరించన తీరును బీజేపీ నేతలు సైతం అభినందిస్తున్నారు.












Click it and Unblock the Notifications