ఇదీ మా రికార్డు - ప్రధాని మోదీకి రేవంత్ కౌంటర్..!!

ముఖ్యమంత్రి రేవంత్ ప్రధాని మోదీ వ్యాఖ్యల పై ఘాటుగా స్పందించారు. ఎక్స్‌ వేదికగా రేవంత్ ప్రధాని వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు. తన పాలనలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు.
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. ఉద్యోగ వివరాలను ప్రధానికి వివరిస్తూ రేవంత్ ఎక్స్ ఖాతాలో పోస్టు చేసారు.

ప్రధాని మోదీ తాజాగా చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ స్పందించారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు.. తీసుకున్న నిర్ణయాలను ప్రధానికి వివరిస్తూ ట్వీట్ చేసారు. అందులో.. ''ప్రియమైన శ్రీ నరేంద్ర మోదీ జీ. నా రాష్ట్రం, నా ప్రభుత్వం గురించి మీరు చేసిన ప్రకటనలలో అనేక అపోహలు, అవాస్తవాలపై స్పష్టత ఇవ్వడానికి నేను సంతోషిస్తున్నాను. డిసెంబర్ 7, 2023 నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రాష్ట్రంలో ఆనందం ఆశలు వెల్లువెత్తాయి. దశాబ్దం బీఆర్‌ఎస్ దుష్పరిపాలన పోయి ప్రజల్లో సంతోషం వెల్లివిరిసిందన్నారు.

CM Revanth Counter for PM Modi over his comments Explains government Success

బాధ్యతలు స్వీకరించిన రెండు రోజుల్లోనే, తెలంగాణ ప్రభుత్వం మొదటి, రెండవ వాగ్దానాన్ని నెరవేర్చింది. అన్ని టీజీఎస్‌ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల ఆరోగ్య సంరక్షణ, ఆసుపత్రి కవరేజీని విడుదల చేసింది. గత 11 నెలల్లో తెలంగాణాలోని సోదరీమణులు, తల్లులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ప్రయాణించారు. రాష్ట్రవ్యాప్తంగా 101 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారు. ఒక సంవత్సరంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం 3,433.36 కోట్లు ఖర్చు చేశామని రేవంత్ వివరించారు.

కొనసాంగిపుగా తమ మొదటి సంవత్సరం పూర్తి కాకముందే, మేము రైతులకి భరోసా ఇస్తూ రైతు రుణమాఫీని అమలు చేశాము. 22 లక్షల 22 వేల మంది రైతులు (22,22,365) ఇప్పుడు ఎలాంటి రుణం లేకుండా, రాజులా జీవిస్తున్నారు. రూ. 2,00,000 వరకు రైతుల రుణాలన్నీ మాఫీ చేయబడ్డాయి. 25 రోజుల్లో 18 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామని సీఎం చెప్పుకొచ్చారు. ఇళ్లకు 200 యూనిట్ల వరకు గృహ విద్యుత్ ఛార్జీ లేకుండా ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. దీంతో మహిళలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని రేవంత్ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+