ప్రధాని మోదీకి సీఎం రేవంత్ అనూహ్య ప్రతిపాదన..!!

కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జనగణనతో పాటుగా కులగణన చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ నిర్ణయం పైన కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందించింది. తెలంగాణలో ఇప్పటికే కుల గణనను సీఎం రేవంత్ సర్కార్ పూర్తి చేసింది. దీంతో, ఇప్పుడు కేంద్ర నిర్ణయం పైన స్పందించిన సీఎం రేవంత్ కీలక ప్రతిపాదన చేసారు. ఈ నిర్ణయం క్రెడిట్ తొలి నుంచి ఈ అంశం పైన డిమాండ్ చేస్తున్న రాహుల్ కే దక్కుతుం దని చెప్పుకొచ్చారు. ప్రధానికి ప్రత్యేకంగా అభ్యర్ధన చేసారు.

రేవంత్ ప్రతిపాదన
జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సీఎం రేవం త్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలియజేశారు. కులగణన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని.. రాహుల్ పాదయాత్రలో కుల గణనపై చర్చ చేశారన్నారు. కుల గణన చేయాల్సిందేనని రాహుల్ తేల్చి చెప్పారని తెలిపారు. కేంద్రం నిర్ణయంపై రాజకీయాలు మాట్లాడ నని వెల్లడించారు.కుల గణనపై తెలంగాణ రాష్ట్రానికి అవగాహన ఉందన్నారు. కుల గణన కోసం దేశ వ్యాప్తంగా ఒక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులం ఒక్కో జాబితాలో ఉందని తెలిపారు. కుల గణన కోసం మంత్రులతో ఒక కమిటీ ఏర్పడి చేయాలని.. అధికారులతో, నిపుణులతో ఒక కమిటీ వేసి అధ్యయనం చేయాలని సూచించారు.

cm-revanth-credits-rahul-gandhi-for-pushing-caste-survey-demand

తెలంగాణ మోడల్
కేంద్రం కులగణన కోసం తెలంగాణ మోడల్‌ను ఆదర్శంగా తీసుకోవాలని రేవంత్ సూచించారు. ఇందు కోసం మంత్రుల కమిటీ వెంటనే నియమించాలన్నారు. మంత్రుల కమిటీకి తోడుగా నిపుణుల కమిటీని వేయాలన్నారు. ఈ రెండు కమిటీలతో దేశవ్యాప్తంగా అధ్యయనం చేయించా లని తెలిపారు. తూతూ మంత్రంగా కుల గణన చేస్తే దానితో ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పుకొచ్చారు. తాము ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి అనేక విషయాలు, సూచనలు తీసుకొని కులగణన చేశామన్నారు. కుల గణన కోసం 95,000 ఎన్యూమరేటర్లను నియమించామ ని.. పది మంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్ వైజర్‌ను నియమించినట్లు చెప్పారు. మంత్రుల కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించిందన్నారు. కుల గణన చేసిన తర్వాత పబ్లిక్ డొమైన్‌లో పెట్టామని.. కుల గణనలో పాల్గొనని వాళ్ళకి మరోసారి అవకాశం ఇచ్చామన్నారు.

Take a Poll

రాహుల్ కే క్రెడిట్

తెలంగాణలో మూడు నెలల్లోనే ఎలాంటి ఇబ్బందులు రాకుండా కుల గణన చేశామని రేవంత్ వివరించారు. కుల గణన విషయంలో కేంద్రంతో కలిసి నడవడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కుల గణన విషయంలో కేంద్రానికి వచ్చే సందేహాలకు సమాధానం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 1931 తర్వాత కుల గణన చేసింది తెలంగాణ ప్రభుత్వమే అని అన్నారు. కుల గణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రానికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. తెలంగాణ మోడల్ దేశానికి రోల్ మోడల్ అని అన్నారు. కుల గణన ఎప్పుడూ మొదలు పెడతారో మోదీ చెప్పాలన్నారు. ఎప్పటి లోగా కుల గణన చేస్తారని ప్రశ్నించారు. కుల గణన సీక్రెట్ డాక్యుమెంట్ కాదని.. కుల గణన విధివిధానాలు బయట పెట్టాలని రేవంత్ డిమాండ్ చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+