రేవంత్ టీం లో కీలక మార్పులు - ఏరి కోరి, ఆయన ఎంపిక వెనుక...!!
ముఖ్యమంత్రి రేవంత్ పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికార యంత్రాంగ ప్రక్షాళన మొదలు పెట్టారు. తన కార్యాలయంలోనూ మార్పులు చేస్తున్నారు. అనుభవం.. అంకిత భావం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కొందరు అధికారుల తీరు పైన సీఎం రేవంత్ ఆగ్రహం తో ఉన్నట్లు తెలుస్తోంది. తన అంచనాలకు తగినట్లుగా పని చేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ నిర్ణయించారు. అందులో భాగంగా తాజాగా తన టీంలో ఏరి కోరి ఎంపిక చేసిన వారికి అవకాశం కల్పిస్తున్నారు.
రేవంత్ ప్రక్షాళన
ముఖ్యమంత్రి రేవంత్ పాలనలో మార్పులకు సిద్దమయ్యారు. తాజాగా భారీ స్థాయిలో ఐఏఎస్ లను బదిలీ చేసిన ప్రభుత్వం శాఖల వారీగా సమీక్షలు చేస్తోంది. అందులో భాగంగా కీలక శాఖలకు సీని యర్ అధికారులను నియమించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ మార్పులు చేస్తున్నారు. తన కార్యాలయంలోనూ ప్రక్షాళన ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన కార్యాలయంలో సీఎం సంయుక్త కార్యదర్శిగా వ్యవహరించిన సంగీత సత్య నారాయణను వైద్యరోగ్య శాఖ డైరెక్టర్ గా, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోగా బదిలీ చేశారు.

కీలక మార్పులు
ప్రభుత్వం పెట్టుబడుల కోసం ప్రత్యేకంగా కార్యాచరణ అమలు చేస్తున్న వేళ పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న జయేశ్ రంజన్ ను సీఎంవో లోకి తీసుకున్నారు. ఆయనకు కీలకమైన పరిశ్రమలు.. పెట్టుబడులతో పాటు మరికొన్ని కీలక బాధ్యతలు అప్ప జెప్పా రు. సీఎం కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డిని రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్ గా నియమించనున్నట్లు తెలుస్తోంది. సీఎం కార్యదర్శిగా వ్యవహరిస్తున్న షాన వాజ్ ఖాసింకు ఔషధ నియంత్రణ మండలి డైరెక్టర్ జనరల్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక, తాజాగా టీటీడీలో సుదీర్ఘకాలం పాటు జేఈవోగా వ్యవహరించిన కేఎస్ శ్రీనివాసరాజును ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.
శ్రీనివాస రాజు ఎంపిక వెనుక
టీటీడీలో సుదీర్ఘ కాలం శ్రీనివాస రాజు పని చేసారు. రెండేళ్ల పాటు శ్రీనివాస రాజు ఈ పదవిలో కొనసా గనున్నారు. ఏపీ నుంచి రిలీవ్ అయిన శ్రీనివాస రాజు తెలంగాణలో రిపోర్ట్ చేసారు. తెలంగాణ లోనూ పలు కీలక శాఖలను పర్యవేక్షించారు. పదవీ విరమణ చేసారు. రేవంత్ కు సన్నిహిత అధికారిగా పేరున్న సీనియర్ కావటంతో ఇప్పుడు సీఎంఓలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ పదవిలో ఆయన రెండేళ్లు కొనసాగనున్నారు. ఇక.. సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని కంటిన్యూ చేస్తారని చెబుతున్నారు. సీఎంకార్యదర్శి మాణిక్ రాజ్ కీలక శాఖల్ని పర్యవేక్షిస్తున్నారు. సీఎంకు సన్నిహితంగా ఉండే అజిత్ రెడ్డి ప్రత్యేక కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications