మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - ఇక ఆ పార్టీ వైపే అడుగులు..!!

కొండా సురేఖ పై వేటు పడింది. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేసారు. ఈ మేరకు సీఎం రేవంత్ గవర్నర్ కు సిఫారసు లేఖ పంపారు. కుమార్తె సుస్మిత వ్యాఖ్యల తరువాత కొండా సురేఖ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఢిల్లీలో పార్టీ నాయకత్వంతో నూ కొండా సురేఖ చర్చలు చేసారు. అయితే, రేవంత్ కోరిన విధంగా హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక.. ఇప్పుడు కొండా సురేఖ పార్టీ వీడటం.. తదుపరి నిర్ణయం ఆసక్తి కరంగా మారింది.

తెలంగాణ మంత్రిగా కొండా సురేఖ పైన వేటు వేసారు. కేబినెట్ నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేస్తూ సీఎం రేవంత్ గవర్నర్ కు సిఫారసు చేసారు. ఢిల్లీలో హైకమాండ్ తో కొండా సురేఖ అంశం పైన రేవంత్ సుదీర్ఘంగా చర్చలు చేసారు. ఆ సమయంలోనే సురేఖ మరోసారి రేవంత్ లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేసారు. తన పైన చర్యలు తీసుకోవాలంటే ముందుగా రేవంత్ పైన చర్య లు తీసుకోవాలని డిమాండ్ తో పాటుగా.. కేబినెట్ మంత్రుల పైనా ఆరోపణలు గుప్పించారు. ఇక, ఈ వ్యాఖ్యలతో హైకమాండ్ సురేఖ ను తప్పించాలని నిర్ణయించింది. ముందుగా సురేఖతోనే రాజీ నామా చేయించాలని భావించినా.. తాజా వ్యాఖ్యలతో బర్తరఫ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారం తో సురేఖ తన మద్దతు దారులతో భేటీ అవుతున్నారు. కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. తన నిర్ణయం ప్రకటించనున్నారు.

కొండా సురేఖ సంచలన నిర్ణయం: మంత్రి పదవి.. పార్టీకి రాజీనామా..!?
కొండా సురేఖ సంచలన నిర్ణయం: మంత్రి పదవి.. పార్టీకి రాజీనామా..!?
cm-revanth-decides-to-dismiss-konda-surekha-sends-recommendation-to-governor-full-details-here

సురేఖ తదుపరి నిర్ణయం పై ఉత్కంఠ..

కేబినెట్ నుంచి బర్తరఫ్ కావటంతో సురేఖ తదుపరి నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. కొండా సురేఖ ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి.. పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన మద్దతు దారులతో మంత్రాంగం కొనసాగిస్తున్నారు. తన పైన వేటు ఖాయమని డిసైడ్ అయిన సురేఖ తదుపరి కార్యాచరణ కు నిర్ణయించారు. ఇప్పటికే బీజేపీ నుంచి కొండా సురేఖ కుటుంబానికి ఆహ్వానం అందింది. దీంతో.. సురేఖ తిరిగి బీఆర్ఎస్ వైపు వెళ్తారా.. లేక బీజేపీ లోకి వెళ్తారా అనేది నిర్ణయం కావాల్సి ఉంది. తనను బర్తరఫ్ చేయటం అవమాన కరంగా భావిస్తున్న సురేఖ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నిక లో పోటా చేయాలని భావిస్తున్నారు. దీంతో.. ముందుగా రాజీనామా ప్రకటన తరువాత.. తదుపరి రాజకీయ ప్రయాణం పైన ప్రకటన చేసే విధంగా ఆలోచన చేస్తున్నారు. దీంతో.. ఇప్పుడు కొండా సురేఖ నిర్ణయం పైన కాంగ్రెస్ లో ఉత్కంఠ పెరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+