పర్యాటక ప్రాంతంగా దుర్గం చెరువు, హైదరాబాద్ కేంద్రంగా ఇక..!!

దుర్గం చెరువును పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని అధికారుల‌ను తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌ ఆదేశించారు. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలని అధికారులను నిర్దేశించారు. వికారాబాద్‌లోని వీరభద్రస్వామి దేవాలయాన్ని డెవలప్ చేసి యాదాద్రి తరహాలో ఆలయానికి కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.

తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ముఖ్యంగా హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు.గొల్కొండ సమీపంలోని తారామతి బారాదరిని టూరిజం ప్రాంతంగా మరింత అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దుర్గం చెరువును పూర్తి స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. మంజీరా, దిల్‌కుషా గెస్ట్ హౌస్‌లను ఆధునికీకరించాలని ఆదేశించారు. టూరిజం హబ్ డెవలప్‌మెంట్ పథకం కింద వికారాబాద్‌ను అభివృద్ధి చేయాలన్నారు. వికారాబాద్‌లోని వీరభద్రస్వామి దేవాలయాన్ని డెవలప్ చేసి యాదాద్రి తరహాలో ఆలయానికి కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో భాగ్యనగరంలో ఎకో పార్కులను తీర్చిదిద్దాలని ఆదేశించారు.

 జమిలి, డీలిమిటేషన్ పై కేంద్రం బిగ్ ట్విస్ట్ - విపక్షాలు ఊహించని విధంగా..!!
జమిలి, డీలిమిటేషన్ పై కేంద్రం బిగ్ ట్విస్ట్ - విపక్షాలు ఊహించని విధంగా..!!
cm-revanth-directed-officials-to-further-develop-key-tourist-destinations-including-taramati-baradar

హైదరాబాద్ కేంద్రంగా టూరిజం

కాగా, క్యూర్ పరిధిలోని అటవీ శాఖ భూములను పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలోని అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలన్నారు. అర్బన్ ఫారెస్ట్ తరహాలో ఏర్పాట్లు చేయాలని, ఆ ప్రాజెక్టుల కోసం ప్రత్యేక అధికారిని నియమించి పనులను ముమ్మరం చేయాలన్నారు. పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జిలను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని, బ్రిడ్జిలపై పర్యాటకుల కోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు. అవకాశం ఉంటే ట్రాఫిక్‌ను మళ్లించి పర్యాటకులకు అవకాశం కల్పించాలన్నారు ముఖ్యమంత్రి. డిసెంబరులో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌పైనా కసరత్తు ప్రారంభించాలని, సమ్మిట్ కోసం శాఖల మధ్య సమన్వయం కోసం కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+