కేసీఆర్ నిర్ణయాల సమూల మార్పు - రేవంత్ మార్క్ రాజకీయం..!!
తెలంగాణలో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. రేవంత్ పూర్తిగా తన మార్క్ రాజకీయంతో ముందుకు వెళ్తున్నారు. గతంలో చెప్పిన విధంగానే కేసీఆర్ ముద్ర లేకుండా చేసేందుకు అడుగులు వేస్తున్నారు. తాజాగా లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధిస్తామని రేవంత్ ధీమాగా ఉన్నారు. పంచాయితీ ఎన్నికలు సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ గతంలో అమలు చేసిన నిర్ణయాల పైన సమీక్షచేస్తున్నారు. కీలక నిర్ణయాలు ఖాయంగా కనిపిస్తున్నాయి.
రేవంత్ నిర్ణయాలు
పాలనలో పూర్తిగా తన ముద్ర ఉండేలా రేవంత్ వ్యవహరిస్తున్నారు. గతంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల పైన సమీక్ష చేస్తున్నారు. గతంలో టీఎస్ ఉండగా..ఇప్పుడు ఆ స్థానంలో టీజీ తీసుకొచ్చారు. అదే విధంగా కేసీఆర్ హాయంలో జిల్లాల సంఖ్య నాడు పది ఉండగా...33కి పెంచారు. కానీ, రేవంత్ 33 జిల్లాలను 17కు కుదించబోతున్నారు. తెలంగాణలో జిల్లాల సంఖ్య పెంచడం వల్ల పాలన సులభతరం అయిందని, చాలా చోట్ల జిల్లా కేంద్రాలు, కలెక్టరేట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. జిల్లాలను కుదిస్తే వ్యవస్థలన్నీ తిరిగి అస్తవ్యస్తమవుతాయని చెబుతున్నారు. కానీ రేవంత్ మాత్రం జిల్లాల సంఖ్య తగ్గించే విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ మార్క్ ఉండేలా
జిల్లాల పునర్ వ్యవస్థీకరణ నిర్ణయం సరిగ్గా లేదని అస్తవ్యస్తంగా జరిగిందనేది రేవంత్ అభిప్రాయం. కొన్ని నియోజకవర్గాలు రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయని, అలాంటి చోట్ల సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. తెలంగాణలో 17 జిల్లాలు ఉండాలని భావిస్తున్నారు. ఇక..తెలంగాణ తల్లి విగ్రహ రూపు రేఖలు మార్చడంతోపాటు, సంక్షేమ పథకాల పేర్లు కూడా దాదాపుగా మార్పు దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో 'మన ఊరు - మన బడి' స్కీమ్ ఉండగా దాని స్థానంలో 'అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు' అనే కొత్త వ్యవస్థకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతుబంధు స్కీమ్ రైతుభరోసా గా, 'ఆసరా' స్కీమ్ చేయూత గా మారిపోతున్నాయి.

వరుస మార్పులు
తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న మొత్తం 12 పథకాలకు మార్పులు జరగబోతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. టీఎస్-ఐపాస్ పాలసీని విభజించి వేర్వేరు పాలసీలను రూపొందించబోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకోసం రూపొందించిన 'సీఎం బ్రేక్ ఫాస్ట్'కి కూడా ప్రత్యామ్నాయం వెదికే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.లనలో బీఆర్ఎస్ మార్క్ లేకుండా చేయాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన. లోక్ సభ ఎన్నికల హడావిడి పూర్తయ్యాక, స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తారు. ఆ తర్వాత క్రమక్రమంగా ఒక్కో మార్పు తెరపైకి వస్తుంది. ఏడాది చివర్లోగా ఈ మార్పులన్నీ అమలులోకి వస్తాయనే చర్చ సాగుతోంది. అయితే, అన్నింటి పైనా అసెంబ్లీలో చర్చించిన తరువాతనే నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications