యూనివర్సిటీల పేరు మార్పుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్..!
తెలంగాణలో వర్సిటీల పేర్లు మార్చడంపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ రాజకీయాలు కలుషితమయ్యాయో.. నాయకుల ఆలోచనలు కలుషితమయ్యాయో తెలియడం లేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత పరిపాలనలో భాగంగా కొన్ని పాలనా పరమైన నిర్ణయాలు తీసుకున్నామని అందులో భాగంగానే పేర్లు మార్చడం జరుగుతుందన్నారు. అయితే అందుకు కులాల పేరుతో రాజకీయం చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.
పొట్టి శ్రీరాములు వర్సిటీ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టిన తర్వాత.. గత పదేళ్లలో యూనివర్సిటీల పేర్లు మార్చడానికి గల కారణాలను వెల్లడించారు. రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వారిని స్మరించుకుని వారి పేర్లు పెట్టుకుంటున్నామన్నారు ముఖ్యమంత్రి. రాష్ట్ర పునర్విభజన తరువాత గత పదేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో పెట్టిన పేర్లతో కొనసాగుతున్న యూనివర్సిటీలకు తెలంగాణలో పేర్లు మార్చామన్నారు.

ఒకే పేరుతో రెండు యూనివర్సిటీలు ఉంటే పరిపాలనలో గందరగోళం ఉంటుందని అన్నారు. అందుకే తెలంగాణ లోని యూనివర్సిటీలకు, సంస్థలకు తెలంగాణ పేర్లు పెట్టుకుంటున్నామని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ పేరు పెట్టామన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ పేరు, వైఎస్ పేరుతో ఉన్న హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు.. వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ పేరు.. పెట్టుకున్నామని తెలిపారు. అంత మాత్రానా వైఎస్ఆర్, ఎన్టీఆర్ ను అగౌరవపరిచినట్టు కాదన్నారు.
ఇప్పుడు అలానే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు మార్చడం జరుగుతుందన్నారు. ఎవర్ని అవమానపరచడం, తక్కువ చేయడం తమ ప్రభుత్వ ఉద్దేశం కాదన్నారు. గుజరాత్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో ఉన్న స్టేడియం పేరు తొలగించి ప్రధాని మోదీ పేరు పెట్టిన విషయాన్ని బీజేపీ నేతలకు గుర్తు చేశారు. ప్రాణత్యాగాలు చేసిన వారిని తక్కువ చేయడం లేదని వారి ప్రాణత్యాగాన్ని గుర్తించి అందరూ స్మరించుకోవాలన్నారు.
తెలంగాణలో నూతనంగా ప్రారంభించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకుందామన్నారు. ఈ విషయంలో చిత్తశుధ్ది ఉంటే కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావాలని సూచించారు. బల్కంపేట నేచర్ క్యూర్ హాస్పిటల్ కు మాజీ సీఎం రోశయ్య పేరు పెడతామని సూచించారు. రోశయ్య సేవలను కీర్తించుకునేలా అక్కడ ఆయన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకుందాని పిలుపునిచ్చారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications