అమెరికా వేదికగా రేవంత్ పిలుపు - చంద్రబాబు పాలనపై..!!

తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించాలంటే ప్రవాస భారతీయులు తమవంతు సాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ పిలుపునిచ్చారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూల వాతావరణం ఉందన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను భారతీయులు డిక్టేట్ చేసే స్థాయికి చేరుకున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన చేసిన పనులు, చేయబోతున్న ప్రణాళికలను ఎన్నారైలకు వివరించారు సీఎం రేవంత్‌రెడ్డి.

రేవంత్ ఆహ్వానం
తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారని గుర్తు చేశారు. అమెరికాలోకి న్యూజెర్సీ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌‌లో ఎన్నారైల పారిశ్రామిక‌వేత్తలతో సమావేశం జరిగింది. హైదరాబాద్‌లో హైటెక్ సిటీని అప్పటి సీఎం నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి పునాది వేశారని, కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందన్నారు ముఖ్యమంత్రి గా చంద్రబాబు పాలనలో హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందన్నారు. సిద్ధాంతపరంగా భిన్నాభిప్రాయాలు వున్నా, ఏకాభ్రిప్రాయంతో ముందుకెళ్లామని రేవంత్ చెప్పుకొచ్చారు.

CM Revanth invites NRI s to invest in Telangana Seek Support for state development

సీఎంలు మారినా
హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు రచించి ముందుకెళ్తున్నామన్నారు. ఈ విషయంలో అనుమానాలు అపోహాలను తొలగించాలన్నారు. హైదరాబాద్ నగరానికి మెరుగైన స్థానం కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఎన్నికల ముందు తమపై ఎంతో విష ప్రచారం జరిగిందని.. గిట్టని వాళ్లందరూ అసలు కాంగ్రెస్ అధికారంలోకి రాదని అన్నారని గుర్తు చేసారు. వచ్చినా అది ఉండనే ఉండదన్నారన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి మందగిస్తుందంటూ లేని పోని అపోహలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్ చెప్పుకొచ్చారు.

సహకరించండి
ఇప్పటికే వాళ్లకు తగిన బుద్ధి చెప్పామన్నారు. హైదరాబాద్‌ను భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా అభివృద్ధి చేసేందుకు పోటీ పడతామని సీఎం రేవంత్ ప్రకటించారు. తెలంగాణకు ఎన్నారైల సేవలు అందించాలని రేవంత్ కోరారు.తెలంగాణలో మెట్రో కోర్ అర్బన్ తో పాటు , సెమీ అర్బన్, రూరల్ క్లస్టర్లుగా విభజించి పెట్టుబడులకు ప్రత్యేకమైన వ్యవస్థలను రూపొందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ స్థాయి మాస్టర్‌ ప్లాన్ తో హైదరాబాద్ ను అత్యున్నత స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు అందరూ సహకరించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+