రూ.500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో రూ.500 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన సీఎం ప్రసంగించారు. రాజీవ్ గాంధీ కన్న కళలను నేరేవేరుద్దామని రేవంత్ పిలుపునిచ్చారు. వందేళ్ల చరిత్ర కలిగిన యూనివర్సిటీకి నిధులు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. అంతర్జాతీయ యూనివర్సిటీలతో పోటీ పడాలని విద్యార్థులకు సూచించారు.
ఈ యూనివర్సిటీలో చదువుకోవడం ఇక్కడి విద్యార్థుల అదృష్టమని, మీ అన్నగా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకాన్ని అమలు చేస్తున్నానన్న సీఎం రేవంత్ రెడ్డి.. స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించి వారికి పాఠశాలల నిర్వహణ బాధ్యత అప్పగించామని వివరించారు. ఆడబిడ్డలు వంటింటి కుందేళ్లు కాదని.. వారు వ్యాపారవేత్తలుగా రాణిస్తారన్న భావనతో ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు.

మహిళలకు 10 ఎలక్ట్రిక్ బస్సులు అందిస్తున్నామని తెలిపారు. మహిళలకు వీటన్నింటితో పాటు చదువు చాలా ముఖ్యమని బాగా చదువుకొని యూనివర్సిటీకి పేరు తీసుకురావాలని కోరారు. అదానీ, అంబానీలతో మహిళలు పోటీపడేలా కార్యాచరణ తీసుకుంటున్నామని తెలిపారు. అంతకుముందు విశ్వవిద్యాలయంలో దర్బార్ హాల్‌ను సీఎం సందర్శించారు.
ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే సందర్భం వస్తుందని, అందులో మీ ప్రాతినిధ్యం ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. మహిళలకు ఐఏఎస్ ఐనా.. మంత్రులు ఐనా అవకాశం వచ్చిన వాళ్ళు.. తమ చిత్తశుద్ధిని నిరూపించుకుని ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. మహిళా రిజర్వేషన్ కోసం సోనియా గాంధీ కృషి చేశారని సీఎం తెలిపారు. మహిళలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.
Hon'ble CM Sri.A.Revanth Reddy participates in Laying foundation for Veeranari Chakali ILamma Women’s University at Koti, Hyderabad. https://t.co/Al40LfqrC3
— Telangana CMO (@TelanganaCMO) March 8, 2025
ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications