కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!!
ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం - పార్టీ ప్రక్షాళన దిశగా హైకమాండ్ తో చర్చలు చేసారు. డీసీసీల నియామకం పూర్తి కావటంతో.. మంత్రివర్గంలో మార్పుల పైన కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా టీపీసీసీ చీఫ్ మార్పు ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా రేవంత్ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాములమ్మకు మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కేబినెట్ లో ఇద్దరిని తెలిగించే ఛాన్స్ కనిపిస్తోంది. కొత్తగా ముగ్గురు కేబినెట్ లోకి రానున్నారు.
తెలంగాణ మంత్రివర్గంలో కీలక మార్పులకు రంగం సిద్దం అవుతోంది. కొందరు మంత్రుల పని తీరు.. వివాదాలు.. రాష్ట్రంలో పార్టీ బలోపేతం దిశగానూ కొత్త వ్యూహాల పైన కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగా మంత్రివర్గంలోకి మరో డిప్యూటీ సీఎం ను బీసీ వర్గం నుంచి అవకాశం ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా ఉన్న విజయశాంతికి గతంలో ఇచ్చిన హామీ మేరకు మంత్రివర్గంలోకి తీసుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం.

అదే సమయంలో పీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ గౌడ్ ను కేబినెట్ లోకి తీసుకొని.. మరో బీసీ నేతను పీసీసీ చీఫ్ గా చేయాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ఇక.. ఇద్దరి మంత్రులకు ఉద్వాసనతో పాటుగా కీలక శాఖల్లో మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ గౌడ్ ను డిప్యూటీ సీఎంగా బీసీ కోటాలో చేసే ప్రతిపాదన పైన చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తరువాత భారీ ప్రక్షాళన
ప్రస్తుత కేబినెట్ లో ఎస్సీ వర్గం నుంచి భట్టివిక్రమార్క ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దామోదర్ రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ మంత్రులుగా కొనసాగుతున్నారు. కాగా, బీసీల నుంచి పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నారు. వీరికి అదనంగా మరొకరిని డిప్యూటీ సీఎంగా తీసుకుం టే బీసీలకు మరింత ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని లెక్కలు వేస్తున్నారు. కాగా, మహేష్ గౌడ్‌కు డిప్యూటీ సీఎం హోదా కల్పిస్తే.. టీపీసీసీకి కొత్త చీఫ్‌గా ప్రస్తుతం ఉన్న బీసీ మంత్రుల్లో ఒకరిని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. కాగా, టీపీసీసీ చీఫ్ గా పొన్నం ప్రభాకర్ పేరు పైన చర్చ జరుగుతోంది.
ఇప్పటికే మంత్రుల పనితీరుపై ఇప్పటికే ప్రగతి నివేదికలు అందించిన అధిష్ఠానం తదుపరి సమీక్ష నాటికి పనితీరు మెరుగుపరుచుకోవాలని లేదంటే చర్యలు తప్పవని పలువురికి స్పష్టం చేసారు. కానీ, మంత్రుల శాఖల్లో సమూలంగా మార్పులు తీసుకురావాలన్న నిర్ణయానికి అధిష్ఠానం వచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలతో హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రిని తొలిగించటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తరువాత మంత్రివర్గ ప్రక్షాళన జరగనున్నట్లు తెలుస్తోంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!













Click it and Unblock the Notifications