మంత్రివర్గ విస్తరణ పై రేవంత్ కీలక నిర్ణయం..!!
తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్దం అవుతోంది. జూన్ 4న లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. జూలై, ఆగస్టులోనే పంచాయితీ ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు జరుగుతోంది. దీంతో, తన మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెల్లడి తరువాత తన మంత్రివర్గ విస్తరణకు వీలుగా రేవంత్ హైకమాండ్ అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది.
మంత్రివర్గ విస్తరణ
తెలంగాణలో మరోసారి రాజకీయ సందడి ప్రారంభం కానుంది. పంచాయితీ ఎన్నికలను పూర్తి చేసేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. ఇక..పంచాయితీ ఎన్నికలకు ముందే మంత్రివర్గ విస్తరణ ..నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. జూన్ ద్వితీయార్ధంలో మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో సీఎంతో సహఆ 12 మంది ఉన్నారు. మరో ఆరుగురికి ఛాన్స్ ఉంది.

పంచాయితీ ఎన్నికల దిశగా
ప్రస్తత కేబినెట్ లో ఖమ్మం నుంచి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరావు ఉన్నారు. నల్గొండ నుంచి ఉత్తమ్‌కుమార్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వరంగల్ నుంచి కొండా సురేఖ, సీతక్క, కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు ఉన్నారు. ఇక హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేలు ఎవరు లేరు. బీఆర్ఎస్ నుంచి ఎవరైనా వస్తే వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా పదవులు ఉంటాయని గతంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు చెప్పుకొచ్చారు.
ఆ జిల్లాలకు ప్రాధాన్యత
కొత్తగా ఛాన్స్ ఆశిస్తున్న వారిలో రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి ఎమ్మెల్యే రామ్‌మోహన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఈ రేసులో ఉన్నారు. నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలకు ఈ సారి మంత్రివర్గంలో ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. రైతు రుణ మాఫీ పూర్తి చేసి..కొత్త కేబినెట్..నామినేటెడ్ పదవుల ద్వారా పూర్తి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రైతు రుణమాఫీ పైన బ్యాంకర్లతో ప్రభుత్వం చర్చలు చేస్తోంది. దీంతో, జూన్ ద్వితీయార్ధంలో రాష్ట్రంలో మరోసారి రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications