హైదరాబాదులో మరో బడా కంపెనీ..రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్..!!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రపంచంలోనే ప్రముఖ కంపెనీల్లో ఒకటైన వాన్‌గార్డ్ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత.. భారత్ లో మొట్టమొదటి గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ని హైదరాబాద్‌లో స్థాపించాలనే నిర్ణయించినట్టు ప్రకటించారు. మన దేశంలో వాన్ గార్డ్ నెలకొల్పే తొలి జీసీసీ ఇదే కావటం విశేషం. ఈ ఏడాది చివర్లో అధికారికంగా కార్యాలయాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. రాబోయే నాలుగు సంవత్సరాలలో దాదాపు 2,300 మంది సభ్యులకు ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేశారు.
ఇక ఈ భేటీలో వాన్‌గార్డ్ సీఈవో సలీం రామ్‌జీ, ఐటి విభాగం ఎండీ నితిన్ టాండన్, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ జాన్ కౌచర్, జిసిసి-వాన్‌గార్డ్ ఇండియా ప్రిన్సిపాల్, హెడ్ వెంకటేష్ నటరాజన్ సహా పలువురు పాల్గొన్నారు. అలానే తెలంగాణ ప్రభుత్వం తరపున తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం, సీఎస్ శాంతి కుమారితో సహా ఉన్నతాధికారులను హాజరయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, మొబైల్ ఇంజనీరింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించిన ఇంజనీర్లను నియమించుకునేందుకు యాజమాన్యం ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

హైదరాబాద్ లో వాన్ గార్డ్ జీసీసీ ఏర్పాటుకు ముందుకు రావటం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించా. తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా హైదరాబాద్‌ను ప్రపంచానికి గమ్య స్థానంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. వాన్‌గార్డ్ రాకతో ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ మరింత బలపడుతుందని అన్నారు. మన దేశంలోని ప్రతిభను మరింతగా ఉపయోగించుకోవడానికి.. సాంకేతిక నిపుణులకు ఉద్యోగ అవకాశాలు అందించడంలో జీసీసీ ముఖ్యపాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని కంపెనీ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు.
అలానే హైదరాబాద్‌లో వైవిధ్యమైన ప్రతిభతో పాటు, జీవన నాణ్యత, సాంకేతిక నైపుణ్యం, ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణముందని కంపెనీ సీఈవో సలీం రాంజీ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ను తమకు అనువైన చోటని.. తమ వినియోగదారులకు ప్రపంచస్థాయి సేవలను అందిస్తామన్నారు. అంతే కాకుండా ఏఐ, మొబైల్, క్లౌడ్ టెక్నాలజీలో ప్రతిభావంతులైన ఇంజనీర్లను అవకాశాలు కల్పించటం తమకు సంతోషంగా ఉందన్నారు.
వాన్‌గార్డ్ సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్ భేటీ.. భాగ్యనగరంలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ! #RevanthReddy #Telangana #Vanguard #OITelugu pic.twitter.com/hqepCwnzE0
— oneindiatelugu (@oneindiatelugu) March 31, 2025












Click it and Unblock the Notifications