రూటు మార్చిన రేవంత్ - ఢిల్లీ కేంద్రంగా, కీలక నిర్ణయం..!!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం రేవంత్ రూటు మార్చారు. ఢిల్లీ కేంద్రంగా తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు వరుస విచారణల తో బీఆర్ఎస్ నేతలు ఇరకాటంలో ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. ఈ సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు... బీసీ రిజర్వేషన్ల అమలు అంశంలో రేవంత్ కొత్త వ్యూహాల అమలుకు సిద్దమయ్యారు.

రేవంత్ కార్యాచరణ
ముఖ్యమంత్రి రేవంత్ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ అంశం తోనే ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారు. అటు వరుస విచారణలతో బీఆర్ఎస్ నాయకత్వం ఆత్మరక్షణలో పడింది. బీసీ రిజర్వేషన్ల అంశం పైన బీఆర్ఎస్ తమ వ్యూహాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో ఢిల్లీ కేంద్రంగా రేవంత్ కొత్త ఆలోచనల ను తెర మీదకు తెస్తున్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ బిల్లు కోసం పోరాడుతామని రేవంత్‌ స్పష్టం చేశారు. బిల్లును రాష్ట్రపతి ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదంటే ప్రధాని ఒత్తిడి చేసినట్టు భావించాల్సి ఉంటుందిని రేవంత్ స్పష్టం చేశారు.

cm-revanth-moving-with-new-plans-for-implementation-of-bc-reservations-in-the-state

కొత్త ఆలోచనలు
42 శాతం రిజర్వేషన్ల అమలుకు ఉన్న మార్గాలన్నింటిని ప్రయత్నించామన్న రేవంత్ రెడ్డి కుదరనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల్లో స్థానిక ఎన్నికలకు వెళ్లాలన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు తమ వద్ద 3 మార్గాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. 50 శాతం సీలింగ్‌పై గత ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని పక్కన పెట్టి జీవో ఇవ్వాలని అన్నారు. జీవో ఇస్తే ఎవరైనా న్యాయస్థానానికి వెళ్తే స్టే వస్తుందని, జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లే మొదటి మార్గం సాధ్యం కాదని ఆయన వివరించారు. ఇప్పుడే స్థానిక ఎన్నికలు పెట్టకుండా ఆపడం రెండో మార్గమని రేవంత్ చెప్పారు. స్థానిక ఎన్నికలు ఆపితే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగుతాయన్నారు. కేంద్ర నిధులు రాకుంటే గ్రామాల్లో వ్యవస్థలు నష్టపోతాయని చెప్పుకొచ్చారు.

ముందుకే వెళ్తాం
ఇక, మూడో మార్గం గురించి ఆసక్తి కర విశ్లేషణ చేసారు. మూడవ మార్గం పార్టీ పరంగా బీసీలకు 42శాతం సీట్లు ఇవ్వడమని రేవంత్ అన్నారు. బీసీలకు 42శాతం సీట్లపై ఇతర పార్టీలపైనా ఒత్తిడి తెస్తామని ఆయన వెల్లడించారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నారనే ఆలోచనతోనే అడ్డుకుంటామని కిషన్‌రెడ్డి ఉన్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బీసీలకు అండగా ఉండాలని బీఆర్‌ఎస్‌ నేతలు అనుకోవట్లేదని సీఎం విమర్శించారు. బీసీ బిల్లులను, ఆర్డినెన్స్​ను వెంటనే ఆమోదం తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం తలచుకుంటే రెండ్రోజుల్లోనే చట్టం ఆమోదం పొందుతుందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు మా విధానం బీజేపీ విధానం ఏమిటో చెప్పాలని రేవంత్ డిమాండ్ చేసారు. అసెంబ్లీ సమావేశాల వేదికగా తమ నిర్ణయం వెల్లడించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+