జూబ్లీహిల్స్ ఫలితం పై రేవంత్ సంచలనం- కేటీఆర్ ను అరెస్ట్ చేయాలనుకున్నా, కానీ..!!
జూబ్లీహిల్స్ బై పోల్ పై సీఎం రేవంత్ ఆసక్తి కర విశ్లేషణ చేసారు. కొత్త లెక్కలు తెర మీదకు తెచ్చారు. తుది ఫలితం పైన తన అంచనాలను వెల్లడించారు. బీఆర్ఎస్, బీజేపీని టార్గెట్ చేస్తూ పలు ప్రశ్నలు సంధించారు. తనది లీడర్ మైండ్ సెట్ కాదని.. కేడర్ మైండ్ సెట్ గా పేర్కొన్నారు. సినీ కార్మికులు ఎవరితో ఉన్నారు.. సినిమా వారితో ఎవరు ఉన్నారనేది తెలుసని వ్యాఖ్యానించారు.
కేటీఆర్ - కిషన్ రెడ్డి తోడు దొంగలని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ప్రచారం ముగింపు వేళ రేవంత్ చెబుతున్న లెక్కలు ఉత్కంఠ పెంచుతున్నాయి.
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేసారు. బీజేపీ డిపాజిట్ కోల్పోతుందని.. కిషన్ రెడ్డి దోస్తీ కూడా ఓడిపోతున్నారని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ లో గెలిచి ఏం చేస్తారని రేవంత్ ప్రశ్నించారు. పదేళ్లు మేమే అధికారంలో ఉంటాం.. ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని వివరించారు. నాది లీడర్ మైండ్ సెట్ కాదు.. కేడర్ మైండ్ సెట్ గా చెప్పిన రేవంత్ అవసరమైతే గడప గడపకు వెళ్లి ప్రచారం చేస్తానన్నారు.

2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉండటం ఖాయమని చెప్పుకొచ్చారు. సినీ కార్మికులు ఎవరితో ఉన్నారు.. సినీ తారలతో ఎవరు ఉన్నారో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ కు ఓటు వేయమని జూబ్లీహిల్స్ ఓటర్ల ను కేసీఆర్ అభ్యర్ధించారా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లో ఏటీసీ మంజూరు చేస్తామని రేవంత్ భామీ ఇచ్చారు. కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని అనుకున్నానని.. గవర్నర్ మూడు నెలల నుంచి అనుమతి ఇవ్వటం లేదని రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు.
ఎవరిది అగ్రికల్చర్.. ఎవరిది డ్రగ్స్ కల్చరో ప్రజలు ఆలోచించుకోవాలని రేవంత్ సూచించారు. గల్లీ గల్లీలో గంజాయి కల్చర్ తీసుకొచ్చింది ఎవరో ఆలోచించాలన్నారు. సెంటిమెంటా.. డెవలప్ మెంటా.. జూబ్లీహిల్స్ ప్రజలు తేల్చుకోవాలన్నారు. గతంలో పీజేఆర్ చనిపోయినప్పుడు కేసీఆర్ అభ్యర్థిని నిలబెట్టి ఎన్నికలు తెచ్చారని గుర్తు చేసారు. రాంరెడ్డి వెంకటరెడ్డి విషయంలోనూ కేసీఆర్ అదే విష సంస్కృతి తెచ్చారన్నారు. మాగంటి గోపీనాథ్ తనకు మిత్రుడే.. కానీ తాను అభివృద్ధి చేయాలి కదా అని వ్యాఖ్యానించారు.
దేళ్లకోసారి అధికారం మార్చడం తెలంగాణ ప్రజలకు అలవాటుగా వస్తోందని చెప్పారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసే బాధ్యత తమపై ఉందని రేవంత్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ పథకాలను కొనసాగిస్తూ అదనంగా అనేక కొత్త పథకాలు తెచ్చానని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై ఎవరూ చేయని సాహసం తాను చేసానని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణను నిలిపానన్నారు. దేశంలో ఎవరూ చేయని కుల ణనను తెలంగాణలో చేసి చూపించానని రేవంత్ వివరించారు.












Click it and Unblock the Notifications