Revanth Reddy: ఐటీఐలను ఏటీసీలుగా మార్పు..!
విద్యకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మల్లేపల్లి ఐటీఐలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కు భూమి పూజ చేసిన రేవంత్.. స్కిల్ డెవలప్మెంట్ కోసమే ఐటీఐని ఏటీసీగా మారుస్తున్నట్లు వివరించారు. 50 కోట్లతో మల్లేపల్లిలో ఏటీసీని నిర్మిస్తున్నామని ప్రకటించారు. పదేండ్లుగా ఐటీఐలు నిరుపయోగంగా మారాయని తెలిపారు.
యువతనకు నైపుణ్యాన్ని అందిస్తే ప్రపంచంతో పోటీ పడతారని చెప్పారు. 40 లక్షల మంది యువత ఉద్యోగం లేక బాధపడుతున్నారని గుర్తు చేశారు. సాంకేతిక నైపుణ్యమే ఉద్యోగ అవకాశాలకు దారి చూపించే దిశగా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. సర్టిఫికెట్లు జీవన ప్రమాణాలను పెంచవని.. ప్రపంచంతో పోటీపడాలంటే సర్టిఫికెట్లతో పాటు సాంకేతికత కూడా అవసరమని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు.

విద్యార్థులకు విద్య, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమన్నారు. తాము పాలకులం కాదు..సేవకులం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రూ. 2324 కోట్లతో 64 ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నట్లు వివరించారు. సాంకేతికతను అందించడానికి ముందుకొచ్చిన టాటాకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఐటీ రంగంలో ప్రతి నలులగురిలో ఒకరు తెలుగు వాళ్లు ఉన్నారన్నారని పేర్కొన్నారు.
త్వరలో అన్ని ప్రాంతాల్లో ఏటీసీలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. నిరుద్యోగలుకు శిక్షణ ఇచ్చి నైపుణ్యం పెంచడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. అంతకు ముందు కరీంనగర్ బస్ స్టేషన్‌లో గర్భిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న టీజీఎస్‌ఆర్టీసీ మహిళా సిబ్బందికి రేవంత్ రెడ్డి అభినందించారు.












Click it and Unblock the Notifications