వారికి స్థలం కేటాయింపు.. ఆ రాష్ట్రాలకు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఈశాన్య రాష్ట్రాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ఉచితంగా కేటాయిస్తామని ప్రకటించారు. ఈశాన్య రాష్ట్రాలలో తమ స్నేహ సంబంధాలను మరింత దృఢం తెలుసుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు రేవంత్ రెడ్డి వెల్లడించారు.
వారికి సొంత భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటు
నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ సంస్కృతుల సంగమం, సమృద్ధికి సోపానం అనే పేరుతో నిర్వహించిన ఉత్సవాలలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ సంతోషకరమైన విషయాన్ని ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులకు వివరించారు. ప్రతి ఈశాన్యరాష్ట్రాలు తమ సొంత భవనాన్ని నిర్మించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల తోడ్పాటును అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

హైదరాబాద్ లో ఒక సాంస్కృతిక వారధిగా నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం
దేశంలోని మొట్టమొదటి నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రాన్ని ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయడానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నాయకత్వం వహించాలని రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కోరారు.ఈ అనుబంధ కేంద్రం అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ లో ఒక సాంస్కృతిక వారధిగా నిలుస్తుందని ఆయన అన్నారు.
కళలు, చేతివృత్తులు, సంస్కృతుల ప్రదర్శనలకు మార్కెటింగ్
ఈ నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం ద్వారా ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులకు, వృత్తి నిపుణులకు హాస్టల్స్ సౌకర్యాలు అందుతాయని, వారికి కావలసిన రుచికరమైన భోజనాన్ని అందిస్తుందని ఆయన అన్నారు. అంతేకాకుండా ఆయా రాష్ట్రాలకు చెందిన కళలు, చేతివృత్తులు, సంస్కృతుల ప్రదర్శనలకు, మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా ప్రత్యేక వేదికలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈశాన్య రాష్ట్రాల నిరంతర సహకారం కోసం బలమైన వేదిక
పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయబడతాయి అని, ఇది అనేక రంగాలలో ఈశాన్య రాష్ట్రాల నిరంతర సహకారం కోసం బలమైన వేదిక అవుతుందన్నారు. ఇది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే నినాదాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కూడా కార్యాచరణలో చూపే మహత్తరమైన ప్రణాళిక అంటూ సీఎం రేవంత్ వెల్లడించారు.
8 రాష్ట్రాలతో కలిసి సమిష్టిగా పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధం
ఇదే సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖతో పాటు 8 రాష్ట్రాలతో కలిసి సమిష్టిగా పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ సందర్భంగా ఉంటుందని రేవంత్ స్పష్టం చేశారు. త్రిపుర కు చెందిన జిష్ణు దేవ్ వర్మ తెలంగాణ గవర్నర్ గా, తెలంగాణకు చెందిన ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్గా పనిచేయడం ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న సంబంధాన్ని అనుబంధాన్ని, మరింత బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు.
ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ రెండో ఇల్లు
హైదరాబాద్ ఇప్పటికే ఫార్మా, హెల్త్ కేర్, ఐటీ, స్టార్టప్ వంటి రంగాలలో పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా మారిందని, ఇదే సమయంలో తెలంగాణను అంతర్జాతీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ రెండో ఇల్లు లాంటిదని ఆయన అభివర్ణించారు.
నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ ప్రతినిధులు
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం డిసెంబర్ 8,9 తేదీలలో హైదరాబాద్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ కు గవర్నర్ నుండి ముఖ్యమంత్రి సంపూర్ణ సహకారాన్ని కోరారు. ఇదే సందర్భంలో నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ ప్రతినిధులు దేశంలోని ప్రతి ప్రాంతానికి తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్యాలను తీసుకు వెళ్లడంలో సహాయం చేయాలని ఆయన అభ్యర్థించారు.
-
వారికి గుడ్ న్యూస్.. కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ -
మూసీ తీరాన ఆధ్యాత్మిక వైభవం.. 700 కోట్లతో భారీ ఆలయాల ప్రాజెక్ట్.. సీఎం శంకుస్థాపన -
మూసీపై బిగ్ స్టెప్- చెప్పిందే చేసిన రేవంత్ -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
ఆర్టీవో ఆఫీసులకు తిరిగే పని లేకుండా తెలంగాణా వాహనదారులకు సీఎం రేవంత్ శుభవార్త! -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
తెలంగాణాలో వైద్య సేవలు టాప్.. లెక్కలు చెప్పిన మంత్రి! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!











Click it and Unblock the Notifications