రేషన్ కార్డు పేదవాడి ఆత్మ గౌరవానికి ప్రతీక: సీఎం రేవంత్ రెడ్డి

రేషన్‌ కార్డు పేదవాడి ఆత్మగౌరవం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాతో కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం ఉందన్నారు. జిల్లా అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని తెలిపారు. BRS పార్టీకి 10 ఏళ్లు అవకాశం ఇస్తే గోదావరి నీళ్లు తుంగతుర్తికి ఎందుకు తేలేదని ప్రశ్నించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో 40 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం తిరుమలగిరిలో పర్యటించారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీని అధికారికంగా ప్రారంభించారు.

రేషన్ కార్డు పేదవాడి గౌరవం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పది ఏళ్ల పాలనలో బీఆర్ఎస్‌ సన్నబియ్యం కల్పించలేదని విమర్శలు చేశారు. వరి పంటకు బోనస్ ఇచ్చామని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాతో కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం ఉందన్నారు. జిల్లా అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని తెలిపారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో 40 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం తిరుమలగిరిలో పర్యటించారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీని అధికారికంగా ప్రారంభించారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.

"రేషన్ కార్డు పేదవాడి గుర్తింపు. ఆకలి తీరేందుకు ఉపయోగపడే ఆయుధం కానీ గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ విషయం తెలుసనిపించలేదు. ఆ పాలనలో రేషన్ కార్డులు మంజూరు చేయడం, సన్నబియ్యం అందించడం అనే అంశాలు వెనుకబడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే రాష్ట్రవ్యాప్తంగా 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందించాం. ప్రజలకు అవసరమైన పథకాలను అమలు చేస్తుంటే, రేషన్ షాపుల వద్ద బారులు తీరుతున్నాయి. ఇది మాకు గర్వకారణం" అని సీఎం రేవంత్ అన్నారు.

CM Revanth Reddy Calls Ration Card a Symbol of Poor s Self-Respect

మరోవైపు తుంగతుర్తి నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా బయటపడుతున్న వర్గ విభేదాలపై సీఎం పరోక్షంగా స్పందించారు. ఈ మేరకు ఎమ్మెల్యేకు తనదైన శైలిలో చురకలు అంటించారు. తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువేనని తెలిపారు. ఎమ్మెల్యే సామేలు కాంగ్రెస్ టికెట్ తీసుకుని రూ.50 వేలతో తుంగతుర్తికి వస్తే 60 వేల మెజార్టీతో గెలిపించారన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా చూసుకోవాలని ఎమ్మెల్యేకు సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గ్లాసులో సోడా పోసినంత సులభం కాదు గోదావరి నీళ్లు తేవడం అంటూ గత ప్రభుత్వ హయాంలో భారీ నీటిపారుదల ప్రాజెక్టుల అమలు తీరును ఎద్దేవా చేశారు. ఈ మేరకు పరోక్షంగా జగదీశ్ రెడ్డిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతేకాక.. మరో రెండేళ్లలో లక్ష కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి.. నిరుద్యోగులను ఆదుకునే బాధ్యతను స్వయంగా తాను తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు. బీఆర్ఎస్ పాలనలో నోటిఫికేషన్లు ఇచ్చి.. మళ్లీ వాళ్లే కోర్టుల్లో కేసులు వేయించి, నిరుద్యోగుల జీవితాలతో ఆట ఆడుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కు రాబోయే స్థానిక ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పాలని ప్రజలకు సీఎం రేవంత్ సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+