CM Revanth Reddy: బీఆర్ఎస్, బీజేపీకి అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ సవాల్

CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో కులగణన సర్వేపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బీసీలకు రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీలకు సవాల్ విసిరారు.చట్టప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలన్నారు. చట్ట ప్రకారం 42 శాతం ఇవ్వడం సాధ్యం కాకపోతే పార్టీపరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మేం సిద్ధంగా ఉన్నాం.. మీరు సిద్ధంగా ఉన్నారా అంటూ బీఆర్ఎస్, బీజేపీలను ఉద్దేశించి సీఎం రేవంత్ సవాల్ విసిరారు.

బీసీలకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని ముఖ్యమంత్ర రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజ్యాంగ మార్పులు అవసరమైతే.. దానికైనా కృషి చేస్తామన్నారు. అప్పటివరకు రాజకీయంగా, నైతికంగా కట్టుబడి కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించబోతోందన్నారు. కులగణన సర్వేపై తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలను సీఎం రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు.

CM Revanth Reddy Challenges BRS and BJP on BC Reservations in Telangana Assembly

బీఆర్ఎస్ నేతలు సర్వేలో ఎందుకు పాల్గొనలేదని నిలదీశారు. కులగణన సర్వే 50 రోజులు జరిగితే.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు పాల్గొనలేదని..సర్వేలు భూమి వివరాలు చెప్పాలని ఫామ్ లో ఒక కాలమ్ ఉంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఎవరూ సమాచారం ఇవ్వలేదని సీఎం రేవంత్ విమర్శించారు. 3.54 కోట్ల మంది సర్వేలో పాల్గొంటే అందరూ భూముల వివరాలు ఇచ్చారని.. కానీ కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు భయపడి వివరాలు ఇవ్వలేదని సీఎం రేవంత్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+