ఇవాళ భారతదేశ చరిత్రలో సువర్ణ దినం - సీఎం రేవంత్ రెడ్డి
లోక్‌సభ వేదికగా 131వ రాజ్యాంగ సవరణ (డీలిమిటేషన్) బిల్లు, అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియమ్) వీగిపోవడం భారత రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక విజయమని.. దేశ ప్రజాస్వామ్యానికి ఇది ఒక కీలక మలుపు అని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ మేరకు సీఎం రేవంత్ సోషల్ మీడియా వేదికగా.. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నాయకత్వంలో ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకమై "జాతీయ విపత్తు"ను అడ్డుకున్నాయని అన్నారు. ఈ బిల్లులను "నల్ల బిల్లులు"గా పేర్కొంటూ, దేశ సమగ్రతకు ముప్పుగా అవి మారే అవకాశముందని విమర్శించారు. ఈ పోరాటంలో భాగస్వాములైన ప్రముఖ నేతలు.. M. K. స్టాలిన్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, లాలూ ప్రసాద్ యాదవ్, హేమంత్ సోరెన్, ఫరూక్ అబ్దుల్లా, నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో విపక్షాల ఐక్యత దేశ ప్రజాస్వామ్య బలాన్ని చాటిందని కొనియాడారు.

అలానే మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్, కులగణనతో ముడిపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు.. ఈ అంశాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో విజయవంతమయ్యాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేవలం రాజకీయ లాభాల కోసం దేశ రాజకీయ మ్యాప్‌ను మార్చే ప్రయత్నాలను అడ్డుకున్నామని ఆయన స్పష్టం చేశారు. అలానే మంత్రి సీతక్క కూడా స్పందిస్తూ, "లక్ష్యం మాత్రమే కాదు, దాన్ని సాధించే మార్గం కూడా నైతికంగా ఉండాలి" అని వ్యాఖ్యానించారు. ఎలాంటి షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇక టీపీసీసీ అధ్యక్షుడు Mahesh Kumar Goud కూడా బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ, మహిళా రిజర్వేషన్ల పేరుతో డీలిమిటేషన్ కుట్ర ద్వారా ఉత్తర భారత రాష్ట్రాలకు అధిక సీట్లు కేటాయించే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా కులగణన పూర్తి చేసిన తర్వాతే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి Ponguleti Srinivasa Reddy మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య శక్తులు ఏకమైతే ఎలాంటి చట్టాన్నైనా అడ్డుకోవచ్చని ఈ సంఘటన నిరూపించిందని పేర్కొన్నారు. ఇదే దిశగా సమానత్వం కోసం పోరాటం కొనసాగుతుందని చెప్పారు.
Today will be remembered forever as a Red-letter Day in Indian History, when under the leadership of Shri @RahulGandhi Ji, Leader of Opposition, Lok Sabha, and Shri Mallikarjun @kharge Ji, united all democratic forces and opposition leaders in adverting a national disaster.
— Revanth Reddy (@revanth_anumula) April 17, 2026
I…












Click it and Unblock the Notifications