బీజేపీ బాటలోనే బీఆర్ఎస్‘ఎస్’! సీఎం రేవంత్ హాట్ కామెంట్స్
బీఆర్ఎస్, బీజేపీలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్ ప్రారంభోత్సవం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లోనే నడుస్తూ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ఎస్‌గా మారిందని వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో బీజేపీ.. కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తే.. తెలంగాణలో బీఆర్ఎస్ అదే ఫాలో అవుతుందని విమర్శించారు.
40 ఏళ్లుగా సొంత కార్యాలయం లేకుండానే కాంగ్రెస్ పార్టీ దేశానికి సేవలందించిందని రేవంత్ చెప్పుకొచ్చారు. ప్రపంచంలోనే మేటి దేశంగా భారత్‌ను తయారు చేసేందుకు, భవిష్యత్తు ప్రణాళికలు తయారు చేసే వేదికగా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ఉంటుందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

బీఆర్‌ఎస్ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. దాడి జరిగితే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్రంలోని బీజేపీ తరహాలోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. శాంతిభద్రతల సమస్య వస్తే తక్షణం జోక్యం చేసుకుని పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారని, గత ప్రభుత్వం (బీఆర్‌ఎస్) ఆ పని చేసి ఉండాల్సిందని ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో అన్నారు.
పోలీసుల సమక్షంలో కాంగ్రెస్ కార్యాలయాలపై దాడులు జరిగేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది సీఎం రేవంత్ చెప్పారు. తమకు ఒకరు నేర్పించాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్‌ఎస్ అంటే బీఆర్‌ఎస్‌ఎస్ అదే విధానాలతో ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తోందన్నారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌పై బీజేపీ ఎలాంటి ఆరోపణలు చేస్తే తెలంగాణలోనూ బీఆర్‌ఎస్ అదేపని చేస్తోంది. బీఆర్‌ఎస్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. చట్టాన్నిసమర్థంగా అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని.. తెలంగాణలోనూ ఇదే జరుగుతోందని సీఎం రేవంత్ చెప్పారు. బీజేపీ జూటా మాటలు చెప్పే పార్టీ అని విమర్శించారు. బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదన్నారు. ప్రధాని మోడీ దేశ స్వాతంత్ర్యం విషయంలో మోహన్ భగవత్ వెంట ఉంటారా? లేక దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర్య సమర యోధుల పక్షాన ఉంటారా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications