కేసీఆర్ చికిత్స పై రేవంత్ ఆదేశాలు- గ్రీన్ ఛానల్, ఆస్పత్రికి అధికారులు..!!
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం పై సీఎం రేవంత్ ఆరా తీసారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. వెంటనే అధికారులను ఆస్పత్రికి పంపారు. కేసీఆర్ గాయపడిన విషయం తెలుసుకున్న వెంటనే గ్రీన్ ఛానల్ లో ఆస్పత్రికి తరలించేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆరోగ్య శాఖ కార్యదర్శి ఆస్పత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడారు. సీఎం రేవంత్ కు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి పై సమాచారం ఇచ్చారు.
మాజీ సీఎం కేసీఆర్ ఆస్పత్రిలో చేరారు. గురువారం అర్థరాత్రి ఆయన కాలు జారి కిందపడటంతో తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను సోమాజిగూడ యశోదా హాస్పిటల్‌కు తరలించారు. పరిశీలించిన వైద్యులు కేసీఆర్ తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. దీంతో ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, శుక్రవారం సాయంత్రం కేసీఆర్‌కు హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయనున్నారు. ఇక, ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం పైన ఆరా తీసారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు యశోద హాస్పిటల్ కు వెళ్లిన ఆరోగ్యశాఖ కార్యదర్శి యశోద ఆసుపత్రి వైద్యులను అడిగి కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.

మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్ సెక్రటరీ కి యశోద వైద్యులు చెప్పారు. కెసిఆర్ కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన వెంటనే వెంటనే ప్రభుత్వం స్పందించింది. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ తో ఆసుపత్రికి పోలీస్ అధికారులు తరలించారు. కేసీఆర్ హెల్త్ కండీషన్ పై యశోద వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసారు. కెసిఆర్ ఎడమ కాలు తుంటీ కి సర్జరీ అవసరం ఉందని పేర్కొన్నారు. తుంటి మల్టిపుల్ ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించారు. కేసీఆర్ కోలుకోవటానికి 6-8 వారాల సమయం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు.












Click it and Unblock the Notifications