వైఎస్సార్ బాటలో రేవంత్ - ప్రజా దర్బార్, ప్రజలతో మమేకం..!!
తెలంగాణలో రేవంత్ ప్రజలతో మమేకం అవుతున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన సొంతవాహనంలోనే జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి ప్రజాభవన్‌కు చేరుకున్నారు. అనంతరం ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్ మొదలైంది. ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. రాష్ట్ర నలుమూల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నేడు రేవంత్ ప్రజలతో మమేకం అవుతున్న విధానం..వరుస నిర్ణయాలు నాడ వైఎస్సార్ శైలిని గుర్తు చేస్తోంది.
రేవంత్ ప్రజా దర్భార్ : ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార సభలో రేవంత్ ప్రజా దర్భార్ నిర్వహిస్తానని ప్రకటించారు. ఈ రోజు ప్రభా భవన్ లో ప్రజల నుంచి నేరుగా అర్జీలను సీఎం రేవంత్, మంత్రులు స్వీకరిస్తున్నారు. మరోవైపు ప్రజాదర్బార్‌కు మంచి స్పందన లభిస్తోంది. తమ సమస్యలు నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం అవుతాయని బాధితులు భావిస్తున్నారు. ప్రజాదర్బార్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి ప్రగతి భవన్ ను జ్యోతిరావు పులే ప్రజా భవన్ గా మార్చారు. సామాన్య ప్రజానికం కోసం ప్రజా భవన్ గేట్లు తెరుచుకున్నాయి. సుదీర్ఘ కాలంలో పెండింగ్ లో ఉన్న అంశాల పైన సంఘాల నేతలు.. వ్యక్తిగత సమస్యల పైన మరి కొందరు ప్రజాభవన్ కు చేరుకున్నారు.

సామాన్యులకు అండగా : సామాన్య ప్రజల నుంచి సీఎం రేవంత్ సమస్యలు తెలుసుకున్నారు. నేరుగా సీఎంకు వచ్చిన ఫిర్యాదులను పరిష్కారం కోసం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక అధికారుల టీం ఏర్పాటు చేస్తున్నారు. సమస్యల ను పరిశీలించి ఏ స్థాయిలో పరిష్కారం అవుతాయో గుర్తించి సంబంధిత అధికారులను వాటిని పరిష్కరించాల్సింది అధికార యంత్రాంగం సూచిస్తోంది. అదే విధంగా సచివాలయంలోనూ ఇతర మంత్రులు ఇదే తరహాలో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా సీఎం రేవంత్ సూచనలు చేయనున్నారు. మంత్రుల శాఖలు ఖారరైన తరువాత సచివాలయంలోనూ సామాన్య ప్రజలు మంత్రులను కలిసే అవకాశం కల్పించనున్నారు. అదే విధంగా ప్రజా దర్బార్ లో ఇచ్చిన వినతుల పరిష్కారం పైన అర్జీదారులకు సమాచారం ఇచ్చేలా ఏర్పాట్లు చేసారు.

వైఎస్సార్ ను గుర్తు చేస్తూ : రేవంత్ ప్రమాణ స్వీకారం మొదలు ప్రజలతో మమేకం అయ్యే విషయంలో వైఎస్సార్ తరహాలోనే వ్యవహరిస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం... ఆ వేదిక పైనే తొలి సంతకం..ఇప్పుడు క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ తో ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని ద్వారా సామాన్య ప్రజలకు సీఎం అందుబాటులో ఉన్నారనే అభిప్రాయం కలిగిస్తున్నారు. ఇక..తొలి కేబినెట్ లోనే ఆరోగ్య శ్రీ రూ 10 లక్షలకు పెంపు...ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పైన నిర్ణయాలు తీసుకున్నారు. దీని ద్వారా తాను ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగా ప్రజా పాలన అందిస్తాననే హామీ దిశగా రేవంత్ ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. మరి..రానున్న రోజల్లో ఎలా ఉంటుందనేది చూడాలి.












Click it and Unblock the Notifications