Revanth Reddy: కేసీఆర్‍కు పదవులిచ్చిందే కాంగ్రెస్.. అన్ని బయటకు తీస్తాం..
అసెంబ్లీలో అప్పుడే వాడివేడి చర్చ ప్రారంభమైంది. కేటీఆర్ అసెంబ్లీలో కాంగ్రెస్ హయంలో ఏం జరిగిందో మాట్లాడారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం విన్న తర్వాత రాష్ట్రం ఎలా ఉండబోతుందో అర్థం అవుతోందని చెప్పారు. నక్క మోసం చేయనని, పులి మాంసం తినను అని వాగ్వాదం ఇచ్చినట్లు గవర్నర్ ప్రసంగం ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో తాగు, సాగు, కరెంట్ ఇబ్బంది ఇండేదని గుర్తు చేశారు.
దీనికి కౌంటర్ గా రేవంత్ రెడ్డి మాట్లాడారు. గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గత పాలనలో కేసీఆర్ ను ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. కేంద్రమంత్రిగా అవకాశం కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేకే మహేందర్ రెడ్డి చురుగ్గా పాల్గొన్నారని చెప్పారు.

సిరిసిల్ల నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలోపేతం చేశారని పేర్కొన్నారు. కానీ కేటీఆర్ అదే సమయంలో మేనేజ్ మెంట్ కోటాలో కేటీఆర్ సిరిసిల్ల టికెట్ తీసుకుని ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వచ్చారని విమర్శించారు. గతం గురించి చర్చించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరితే ఒకరోజు సెషన్ పెట్టాలని స్పీకర్ కోరారు. గతంలో జరిగిన పాపాల్లో బీఆర్ఎస్ సభ్యుల్లో చాలామందికి కూడా భాగం ఉందని తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్లను ప్రస్తావించారు.
ప్రతిపక్షం నాయకులు ఇచ్చే సలహాలు, సూచనలను తాము ఎప్పుడు స్వీకరిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంకా ఐదేళ్ల పాలన ఉందని చర్చించుకోవడానికి చాలా సమయం ఉందన్నారు. గవర్నర్ తీన్మానంపై మాట్లాడాలని సూచించారు.












Click it and Unblock the Notifications