దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా..!!: రేవంత్ ఆదేశాలు
Revanth Reddy: లక్షలాదిమంది భక్తులు హాజరయ్యే గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి ఇప్పటి నుంచే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. గతంలో కంటే భిన్నంగా ఈ సారి పుష్కరాలను నిర్వహించాలని భావిస్తోంది. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టేలా ప్రణాళికలను రూపొందించుకుంటోంది.
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ సహా పలువురు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. ఏర్పాట్లపై అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పలు ఆదేశాలు ఇచ్చారు. శాశ్వత ప్రాతిపదికన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని సూచించారు.

లక్షలాదిమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే ఈ ఆధ్యాత్మిక ఉత్సవాల సమయంలో తాత్కాలిక ఏర్పాట్లు సరిపోవని అన్నారు. నది పొడవునా శాశ్వత ప్రాతిపదికన ఘాట్ల అభివృద్ధి చేయాలని చెప్పారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రముఖ ఆలయాల వద్ద శాశ్వత ఘాట్లు నిర్మించాలని, బాసర- భద్రాచలం వరకు గోదావరి తీరంలోని ఆలయాలకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు.
బాసర మొదలుకుని కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం సహా ఇతర ప్రముఖ ఆలయాలను అనుసంధానించేలా జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీ, పంచాయతీ రోడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు పూర్తి చేయాలని అన్నారు. దీనికోసం ఎన్ హెచ్ఏఐ అధికారులతో సమన్వయం చేసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రస్తుతం ఉన్న ఘాట్లను మరింత విస్తరించాలని, రెండు లక్షల మంది ఒకేసారి పుణ్య స్నానాలు చేయడానికి వీలుగా చేయాలని సీఎం సూచించారు.
వాహనాల పార్కింగ్, మంచినీరు, లైటింగ్, భద్రతా చర్యలు వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రమాదాలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. నదీ తీరం పొడవునా గజ ఈతగాళ్లను మోహరింపజేయాలని, బోట్లు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ఆలయ పర్యాటకానికి అనువుగా తెలంగాణ సాంస్కృతిక గౌరవాన్ని ప్రతిబింబించేలా ఆయా ఏర్పాట్లు ఉండాలని అన్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications