ఫ్యూచర్ సిటీపై రేవంత్ బిగ్ స్టెప్..!!

భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఏర్పాట్లు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని అన్నారు. సమ్మిట్‌తో సంబంధం లేని వ్యక్తులు ఎవరూ ప్రాంగణంలోకి రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నందున తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానుంది. దీనికోసం మీర్‌ఖాన్‌పేట్‌లో జరుగుతున్న ఏర్పాట్లను రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. అక్కడే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు సూచనలు చేశారు. వివిధ దేశాల నుంచి అంబాసిడర్లు, ఉన్నతస్థాయి ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉందని, సమ్మిట్‌లో పాల్గొనే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని చెప్పారు.

CM Revanth Reddy Instructs Officials Over Global Summit on December 8-9

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అన్నారు. పాసులు లేకుండా, సమ్మిట్‌తో సంబంధం లేని వ్యక్తులు ఎవరూ ప్రాంగణంలోకి రావడానికి వీలులేదని స్పష్టం చేశారు. శాఖల వారిగా నిర్దేశించిన అధికారులకు ప్రవేశం ఉండాలని, పార్కింగ్‌కు, బందోబస్తులో పాల్గొనే పోలీసులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. ఇక్కడ నిర్మితమౌతోన్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పనులను కూడా ఆయన పరిశీలించారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం రూపొందించే పాలసీ ఆధారంగానే భవిష్యత్తు నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుందని, విధానపరమైన ప్రణాళిక ఉంటే పెట్టుబడిదారులకు ఒక స్పష్టత వస్తుందని చెప్పారు. పెట్టుబడులను రాబట్టుకోవడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం అగ్రగామిగా కొనసాగుతుందని అన్నారు. భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వీలుగా పారిశ్రామిక విధానాలను అమలులోకి తీసుకొచ్చామని చెప్పారు.

పాలసీ డాక్యుమెంట్ ప్రభుత్వంలోని శాఖల వారిగా ఉండాలని, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 లో ఆయా అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులోగా శాఖల వారిగా పాలసీ డాక్యుమెంట్‌ సిద్ధం కావాలని చెప్పారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు, సంబంధిత ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తామని, సమ్మిట్‌ను విజయవంతం చేయడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+