సీఎం రేవంత్ రెడ్డి నిజాయితీ గల మోసగాడు - కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్‌గల్‌లో నిర్వహించిన రైతు మహాధర్నాలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. పదేండ్ల పాటు కేసీఆర్ హయాంలో రైతు ఒక రాజులాగా బ్రహ్మాండంగా బతికాడు అని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనతో ఏ వర్గమూ సంతోషంగా లేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నిజాయితీగల్ల మోసగాడు అని సెటైర్లు వేశారు.
కేసీఆర్ హయాంలో రైతు రాజులా బతికాడని.. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక సోనియాగాంధీ పుట్టినరోజు రెండుసార్లు వచ్చింది.. కానీ రుణమాఫీ 25 శాతం కూడా కాలేదని దుయ్యబట్టారు. 35 సార్లుఢిల్లీ విమానం ఎక్కారు.. 35 పైసలూ తీసుకురాలేదు. అప్పులు కట్టలేదని రైతుల తలుపులు ఎత్తుకెళ్లారు.. రేపో మాపో మహిళల పుస్తెలతాడు కూడా లాక్కెళ్లిపోతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళలు స్కూటీలు ఏమైనయ్ అని ప్రశ్నించాలని.. స్కూటీలు లేవు కానీ లూటీ మాత్రం బాగా నడుస్తుందని అన్నారు.

రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి తెలియదని.. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌తో పాటు సొంత ఊరు, అత్తగారి ఊరు కల్వకుర్తిలో ఏమైనా చేశారా? అని అడగడానికి ఇక్కడకు వచ్చానన్నారు. కులగణన పేరుతో బీసీలను రేవంత్‌రెడ్డి మోసం చేశారని కేటీఆర్ ఆరోపించారు. ఓట్ల కోసం ఇంటికి వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని.. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అని డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని ఆ పార్టీ నేతలు మళ్లీ నాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ మోసపోతే ఎవరూ కాపాడలేరన్నారు.
అలానే ఈ పదిహేను నెలల కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎవరికీ న్యాయం చేయలేదన్నారు. రైతు రుణమాపీ, రైతుబంధు, తులం బంగారం, మహిళలకు రూ. 2500 లాంటి ఏవి అమలు చేయలేదన్నారు. 420 హామీలిచ్చి దొంగమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని ఎద్దేవా చేశారు. రూ. 2 లక్షల రుణమాఫీ చాలా మందికి కాలేదని.. రైతుబంధు కూడా రాలేదని చెప్పారు. గత 6 నెలల నుంచి అన్ని జిల్లాల్లో తిరుగుతున్నామని.. గత పదేండ్లలో మోటార్లు కాలలేదు, ట్రాన్స్‌ఫార్మర్లు పేలలేదని విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications