సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా... త్వరలోనే కొత్త వ్యక్తికి బాధ్యతలు
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి నియామకం ఉండనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. జూన్ నెలాఖరులో లోకల్ బాడీ ఎన్నికలు ఉండటంతో ఆలోగానే కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోతున్నారు. దీంతో ఆశావహులు చాలామంది దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
మంత్రి పదవి కావాలంటున్నాడే..
రెడ్డి సామాజికవర్గానికి చెందిన రేవంత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండటంతో ఇతర సామాజిక వర్గాలకు పీసీసీ పదవి దక్కే అవకాశం కనపడుతోంది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కావాలని పట్టుబడుతున్నారు. ఆయన సోదరుడు వెంకటరెడ్డి మంత్రిగా ఉండటంతో మంత్రి పదవి దక్కడం కష్టమే అవుతుంది. అయితే పీసీసీ అయినా ఇవ్వాలని పట్టుబట్టే అవకాశం ఉంది.

భట్టి అడుగుతున్నారే..
ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందినవారికి ఇవ్వాలని భావిస్తే భట్టి విక్రమార్కకు అవకాశం ఉండొచ్చు. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడ్డ భట్టి అదనంగా పీసీసీ బాధ్యతలు ఇవ్వాలని కోరుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ సీటు ఆశించిన సంపత్ పేరు కూడా వినపడుతోంది. బీసీ సామాజికవర్గం నుంచి మధుయాష్కీ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది.
మధు యాష్కీ, సీతక్క
మధు యాష్కీగౌడ్ రాహుల్ గాంధీకి సన్నిహితుడు కాబట్టి ఆయనకు ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. మహేష్, అంజన్ కు రేవంత్ మద్దతు ఉంటుంది. రేవంత్ ఎవరిపేరు ప్రతిపాదిస్తే వారికే పీసీసీ పీఠం దక్కే అవకాశం కనపడుతోంది. మైనార్టీల నుంచి ఇవ్వాలనుకుంటే షబ్బీర్ అలీ పేరు వినపడుతోంది. ఎస్టీ సామాజికవర్గానికి ఇవ్వాలనుకుంటే మంత్రి సీతక్క కు అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications