Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీ స్కూల్, టీడీపీ కాలేజీ.. రాహుల్ వద్ద జాబ్: మూడు ముక్కల్లో ప్రస్థానం

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకాన్ని మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ ఉదయం హైదరాబాద్ శిల్పకళా వేదికలో అలయ్ బలయ్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

నాలుగు రాష్ట్రాల గవర్నర్లు జిష్ణు దేవ్ వర్మ (తెలంగాణ), సయ్యద్ అబ్దుల్ నజీర్ (ఏపీ), కంభంపాటి హరిబాబు (ఒడిశా), నల్లు ఇంద్రసేనారెడ్డి (త్రిపుర), ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దీనికి హాజరయ్యారు.

CM Revanth Reddy made key remarks on Haryana Guv Bandaru Dattatreya

పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ అనంతరం తొలి కాపీని రేవంత్ రెడ్డికి అందజేశారు బండారు దత్తాత్రేయ. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. బండారు దత్తాత్రేయతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

దత్తాత్రేయను అజాత శత్రువు అని కొనియాడారు రేవంత్ రెడ్డి. కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించే వారు దత్తన్న జీవనశైలిని చూసి ఎంతో నేర్చుకోవలసి ఉందని అన్నారు. ప్రతి సంవత్సరం ఆయన నిర్వహిస్తూ వచ్చిన అలయ్ బలయ్ కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినిచ్చిందని గుర్తుచేశారు.

హైదరాబాద్ గౌలిగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్ వరకు సుదీర్ఘమైన ప్రయాణంలో దత్తాత్రేయ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారని, ప్రజలతో సంబంధాలను ఏనాడూ కోల్పోలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయనతో తనకు 40 సంవత్సరాల అనుబంధం ఉందని, కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.

దత్తాత్రేయను గౌరవించని నాయకులు యావత్ తెలంగాణలోనే ఎవరూ లేరని, దత్తాత్రేయ ఇచ్చిన స్ఫూర్తి తమ ప్రజా ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తుంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయంగా భిన్న మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పటికీ వ్యక్తిగత సంబంధాల విషయంలో దాచిపెట్టాలన్న ప్రయత్నం చేయడం లేదని వ్యాఖ్యానించారు.

దత్తాత్రేయను చూసి ఎంతో నేర్చుకోవాలని, ప్రజలతో సంబంధాలు కలిగి ఉండటంలో ఆయన అజాతశత్రువు అని పేర్కొన్నారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి జాతీయ రాజకీయాల్లో పదవుల్లో ఉన్నా లేకున్నా ఆయన గౌరవం ఎప్పుడూ తగ్గలేదని, అలాగే దత్తాత్రేయను కూడా అదే తీరుగా గౌరవిస్తారని చెప్పారు.

బీజేపీ నాయకుడిగా కన్నా దత్తాత్రేయను ఓ మర్యాద కలిగిన నాయకుడిగా అందరూ గౌరవిస్తారని రేవంత్ రెడ్డి అన్నారు. జంట నగరాల ప్రజలకు ఏ బాధ ఉన్న వినడానికి ఇద్దరు నాయకుల పేర్లు వినిపిస్తాయిని, ఆ ఇద్దరు- ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే పీ జనార్ధన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ అని గుర్తు చేశారు.

జంట నగరాలకు చెందిన నాయకులు పార్టీలకు అతీతంగా ఆ ఇద్దరి నేతలను ప్రజా జీవితాన్ని గమనించాలని, వారి నడవడికను తెలుసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రజలతో సత్సంబంధాలను కోల్పోకుండా పార్టీలకు అతీతంగా న్యాయం చేశారని అన్నారు.దత్తాత్రేయతో పాటు కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డితోనూ తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

రాజకీయాలకు అతీతంగా కిషన్ రెడ్డిని అప్పుడప్పుడు ప్రశ్నిస్తూనే వారితో ఉన్న సాన్నిహిత్యంతో తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని చెప్పారు. తాను బీజేపీ స్కూల్ లో, టీడీపీ కాలేజీలో చదువుకున్నానని, ఇప్పుడు రాహుల్ గాంధీ వద్ద ఉద్యోగం చేస్తున్నానని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+