మరో పదేళ్లు కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితం.. చర్చకు సిద్ధమా? : సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ అధినేత , విపక్ష నేత కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పాలనపై ఆసత్యాలు చేబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన బసవేశ్వర 892 జయంతి వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతో విపక్ష నేతల తీరుపై మండిపడ్డారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన కామెంట్స్‌కు సీఎం రేవంత్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ ఎందుకు అసెంబ్లీ రావడం లేదని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఫాంహౌస్‌లోనే ఉంటూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. ఇదే తీరుతో రాబోయే తరాలకు ఏం సందేశం ఇవ్వవాలనుకుంటున్నారని దుయ్యబట్టారు. అస్సలు బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రే పోషించడం లేదని .. ఆపార్టీ నేతలకు ప్రజల సంక్షేమం, సమస్యలు పట్టడం లేదని ఆరోపించారు.

వచ్చే పదేశ్లు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉటుందని .. కేసీఆర్ ఫాం హౌస్‌కే పరిమితం అవుతారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కొట్టొడి తెచ్చుకున్న మన తెలంగాణను .. గత పదేళ్లు కోతుల గుంపునకు ఇచ్చినట్లైందని విమర్శించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఏం అంశంపై నైనా చర్చకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేసీఆర్ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పక్షం కూడా బలంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ అసెంబ్లీలో ప్రభుత్వానికి ఏవైనా సూచనలు, సలహాలు ఇస్తారని తాము భావించాం.. కానీ అలా జగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు అందించామని రేవంత్ రెడ్డి తెలిపారు. బస్సులు కావాలంటే.. అన్ని బస్సులు ఇచ్చామని చెప్పారు. ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల వద్దకు ఎందుకు వెల్లట్లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ పథకాలను నిలిపివేసినట్లు కేసీఆర్ తప్పడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుబంధు, రైతు రుణమాఫీ, ప్రజా పాలన ఆగిందా.. అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ కేఆర్ఎస్ కు విలన్ అయిందా అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications