హైదరాబాద్‌కు సన్ రైజర్స్ గుడ్ బై..? సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
ఐపీఎల్ 2025 సీజన్ జరుగుతున్న క్రమంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ -హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య ఉద్రిక్తత పెరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ , హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య టికెట్ల వివాదం తీవ్రతరమైంది.HCA అనుచితంగా ప్రవర్తించిందని, బెదిరింపులకు పాల్పడిందని SRH యాజమాన్యం ఆరోపించింది.
ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే, హైదరాబాద్‌ను వదిలివెళ్లే అవకాశం ఉందని హెచ్చరించింది.SRH ఆరోపణలను HCA ఖండించింది.ఉచిత పాస్‌ల విషయంలో (IPL 2025) సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మధ్య గొడవలు పతాకస్థాయికి చేరాయి. పాస్‌ల కోసం HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు తీవ్రంగా వేధిస్తున్నాడని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ సంచలన ఆరోపణలు చేసింది.
ఇలా చేస్తే హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామని బెదిరించింది. ఈ అంశానికి సంబంధించి సన్‌రైజర్స్ జనరల్ మేనేజర్ టిబి శ్రీనాథ్ హెచ్‌సీఏ కోశాధికారి సీజే శ్రీనివాస్ రావు ఓ ఘాటు లేఖ రాశారు. ఉచిత పాస్‌ల కోసం హెచ్‌సీఏ ఉన్నతాధికారులు, ముఖ్యంగా అధ్యక్షుడు ఏ జగన్‌మోహన్ రావు వేధింపులు తీవ్రమయ్యాయి. ఇలాంటి ప్రవర్తనను మేము ఏమాత్రం సహించం అని SRH యాజమాన్యం తెలిపింది. గత రెండు సీజన్లుగా HCA తమ సిబ్బందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని, ఈ విషయాన్ని HCA దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి పరిష్కారం రాలేదని SRH తెలిపింది.
HCA ప్రవర్తన చూస్తుంటే, ఈ స్టేడియంలో SRH ఆడేలా చూడకూడదనే ఉద్దేశంతో ఉన్నట్లుగా అనిపిస్తోంది.

ఇదే నిజమైతే, BCCI, తెలంగాణ ప్రభుత్వం, మా యాజమాన్యంతో చర్చించి, హైదరాబాద్‌ను వదిలి, కొత్త వేదికను చూస్తామని SRH జనరల్ మేనేజర్ (స్పోర్ట్స్) శ్రీనాథ్ హెచ్చరించారు. గత 12 సంవత్సరాలుగా HCAతో కలిసి పనిచేస్తున్నాము. గత సీజన్ నుండి మాత్రమే ఈ సమస్యలు, వేధింపులు ఎదుర్కొంటున్నాము. ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా వారికి ప్రతి సీజన్‌లో 50 కాంప్లిమెంటరీ టికెట్లు (F12A బాక్స్) ఇస్తున్నామని SRH జనరల్ మేనేజర్ (స్పోర్ట్స్) శ్రీనాథ్ తమ ప్రకటనలో తెలిపారు.సన్‌రైజర్స్ టీం హైదరాబాద్ నుంచి వెళ్లిపోతుందనే వార్త బయటకు రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఈ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.ఈ వివాదంపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యాన్ని హెచ్‌సీఏ బెదిరిస్తోందని వస్తోన్న వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. దర్యాప్తు జరిపి నివేదికను సమర్పించాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ డైరెక్టర్ జనరల్ కె శ్రీనివాస్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్రికెట్ మ్యాచ్‌లకు పాస్‌లు డిమాండ్ చేస్తూ SRH యాజమాన్యానికి ఎవరైనా సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.












Click it and Unblock the Notifications