మూసీ రివర్ డెవలప్మెంట్, భారీ వర్షాలపై సీఎం రేవంత్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ
మూసీ రివర్ డెవలప్ మెంట్ మాస్టర్ ప్లాన్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగరం వచ్చే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ నదీ పరివాహక ప్రాంతం అభివృద్ధి జరగాలని అధికారులకు సూచించారు. గేట్ వే ఆఫ్ హైదరాబాద్,
గాంధీ సరోవర్ అభివృద్ధితో పాటు జంక్షన్ల ఏర్పాటు, రోడ్ల అభివృద్ధిపై అధికారులకు పలు సూచనలు చేశారు. గాంధీ సరోవర్ అభివృద్ధికి సంబంధించిన పలు డిజైన్లను పరిశీలించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని సిగ్నల్ రహిత జంక్షన్లను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
మూసీ రివర్ డెవలప్మెంట్,
— Revanth Reddy (@revanth_anumula) August 27, 2025
గాంధీ సరోవర్ ప్రాజెక్టు పై
సమీక్ష నిర్వహించాను.
గేట్ వే ఆఫ్ హైదరాబాద్,
గాంధీ సరోవర్ అభివృద్ధితో పాటు
జంక్షన్ల ఏర్పాటు, రోడ్ల అభివృద్ధిపై
అధికారులకు పలు సూచనలు చేశాను.
సిగ్నల్ రహిత జంక్షన్లను ఏర్పాటు
చేయాలని సూచించాను.
గాంధీ సరోవర్ అభివృద్ధికి… pic.twitter.com/F4rYhgzfF1
మూసీ రివర్ డెవలప్మెంట్, గేట్ వే ఆఫ్ హైదరాబాద్, గాంధీ సరోవర్ అభివృద్ధితో పాటు జంక్షన్ల ఏర్పాటు, రోడ్ల అభివృద్ధి వంటి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ మేరకు అధికారులకు పలు సూచనలు చేశారు. మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రణాళికలను అధికారులు వివరించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని సిగ్నల్ రహిత జంక్షన్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. గాంధీ సరోవర్ అభివృద్ధికి సంబంధించిన పలు డిజైన్లను పరిశీలించారు. అభివృద్ధి పర్యావరణహితంగా ఉండేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. వీలైనంత త్వరగా డీపీఆర్ సిద్ధం చేసి పనులు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. పురాతన ఇళ్లలో ఉంటున్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. అందరూ కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచనలు చేశారు. అలాగే వినాయక చవితి సందర్భంగా మండపాల వద్ద విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్ లు ఉంటే భక్తులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.

మరోవైపు తెలంగాణలో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వర్షాల నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పలు కీలక సూచనలు చేసింది. సీజనల్ వ్యాధులు, నీరు, గాలి ద్వారా సంక్రమించే వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డా. బి. రవీందర్ నాయక్ అడ్వైజరీ విడుదల చేశారు. మలేరియా, డెంగీ, చికున్ గున్యా బారినపడకుండా ఉండాలంటే దోమలు దరిచేరకుండా చూసుకోవాలన్నారు. గాలి ద్వారా సంక్రమించే ఇన్ ఫెక్షన్లు, వైరల్ జ్వరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.












Click it and Unblock the Notifications