మెదక్ చర్చిలో నాడు మాటిచ్చి సీఎంగా తిరిగొచ్చా.. రేవంత్, 192 కోట్ల అభివృద్ధి పనులు
మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బుధవారం మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏసు భక్తులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
వందేళ్లు పూర్తి చేసుకుని మెదక్ చర్చి ఒక గొప్ప దేవాలయంగా గుర్తింపు పొందింది. అలాంటి చర్చి అభివృద్ధికి అవసరమైన నిధులు మా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ చర్చికి నాకు గొప్ప అనుబంధం ఉంది.
నేను పీసీసీ అధ్యక్షుడుగా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు తీసుకున్నా.. మళ్లీ ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చికి వస్తానని ఆనాడు మాట ఇచ్చా అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

శతాబ్ది ఉత్సవాలతో పాటు భక్తులతో క్రిస్మస్ జరుపుకోవాలనే ఇవాళ ఇక్కడకు వచ్చా. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో దళిత, గిరిజన క్రైస్తవులకు అత్యధిక లబ్ది జరుగుతుంది. పేదలకు అందించే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లోనూ వారికి ఎక్కువ లబ్ది జరుగుతోంది అని సీఎం రేవంత్ చెప్పారు.
ఆనాడు క్రిస్టియన్ మెషినరీలు విద్య, వైద్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఆ స్పూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం.
మెదక్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Live: Hon'ble CM Sri.A.Revanth Reddy participates in the Medak Cathedral Church 100 Years Centenary Celebrations https://t.co/crbxtbDtrn
— Revanth Reddy (@revanth_anumula) December 25, 2024
మరోవైపు, మెదక్ జిల్లాలో రూ.192 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రూ.52.76 కోట్లతో మెదక్ నియోజకవర్గంలో వివిధ గిరిజన గ్రామాలను కలుపుతూ రోడ్ల నిర్మాణం,
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణం చేపడుతున్నారు.
మెదక్ జిల్లా స్వయం సహాయక గ్రూప్(SHG) మహిళలకు రూ.100 కోట్ల బ్యాంక్ లింకేజీ చెక్ అందజేశారు. రూ.35 కోట్లతో ఏడుపాయల వద్ద రోడ్డు విస్తరణ, డివైడర్ నిర్మాణం, హైమాస్ట్ లైట్స్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు.
మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం
— Revanth Reddy (@revanth_anumula) December 25, 2024
నాగసాన్ పల్లిలో ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది.
# రూ.192 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం.
# రూ.52.76 కోట్లతో మెదక్… pic.twitter.com/SUyVSz8VR6
వందేళ్లు పూర్తి చేసుకున్న మెదక్ చర్చి: ప్రత్యేకతలు
మెదక్ చర్చి వందేళ్లు పూర్తి చేసుకుంది. ఈ చర్చి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు:
ఆసియాలోనే అతిపెద్ద చర్చి:
మెదక్ చర్చి ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చిలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రపంచంలో వాటికన్ చర్చి తరువాత అతిపెద్ద చర్చిగా కూడా చెబుతారు.
చరిత్ర:
ఈ చర్చి నిర్మాణం 1914లో ప్రారంభమై 1924లో పూర్తయింది.
రెవ. చార్లెస్ వాకర్ పోస్నెట్ దీని నిర్మాణానికి ముఖ్య కారకులు.
నిర్మాణ శైలి:
ఈ చర్చి గోతిక్ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. దీని ఎత్తు 175 అడుగులు. చర్చిలోపలి అలంకరణ, రంగుల గాజు కిటికీలు చూపరులను ఆకట్టుకుంటాయి.
ప్రత్యేకతలు:
చర్చిలో ఉన్న పైపు ఆర్గన్ చాలా ప్రసిద్ధి చెందింది. అలాగే, బైబిల్ నుంచి దృశ్యాలను వర్ణించే రంగుల గాజు కిటికీలు ప్రత్యేక ఆకర్షణ.
స్థానం:
ఈ చర్చి తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో ఉంది.
హైదరాబాద్ నుంచి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది.
వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ చర్చి ప్రాముఖ్యతను, చరిత్రను గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యం.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications