నాగార్జునపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు.. రియల్ హీరో అంటూ
పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అక్కినేని నాగార్జునపై ప్రశంసల జల్లు కురిపించారు. అదే సమయంలో, నగర అభివృద్ధికి అడ్డుపడే కబ్జాదారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని అనేక నాలాలు, చెరువులు కబ్జాలకు గురయ్యాయని ఆరోపించారు. వాటిని తొలగించేందుకు 'హైడ్రా' ద్వారా ఆక్రమణల కూల్చివేత జరుగుతోందని వెల్లడించారు. ఈ క్రమంలో, ఎన్ కన్వెన్షన్‌లో కబ్జాకు గురైన రెండు ఎకరాల భూమిని సినీ నటుడు అక్కినేని నాగార్జున స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారని ముఖ్యమంత్రి తెలిపారు. నాగార్జున చర్యను కొనియాడుతూ, ఆయనే 'రియల్ హీరో' అని ప్రశంసించారు.

హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరాలైన న్యూయార్క్, టోక్యో వంటి వాటితో పోటీ పడేలా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ 'అభివృద్ధి యజ్ఞానికి' ఎంతమంది 'రాక్షసులు' అడ్డుపడినా చేసి తీరుతామని ప్రకటించారు. రాజకీయాల ముసుగులో ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకునే వారిని ప్రజలు గమనించాలని, వారికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.












Click it and Unblock the Notifications