Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ ఫేక్ వీడియోతో నాకు సంబంధం లేదు: ఢిల్లీ పోలీసులకు తేల్చేసిన సీఎం రేవంత్

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఫేక్ వీడియో వ్యవహారంలో తనకు సంబంధం లేదని ఢిల్లీ పోలీసులకు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమాధానం పంపారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తెలంగాణ ట్విట్టర్ ఖాతాను తాను నిర్వహించడం లేదని రేవంత్ స్పష్టం చేశారు.

తాను రెండు ట్విట్టర్ ఖాతాలను (సీఎంవో తెలంగాణ, వ్యక్తిగత ఖాతా) మాత్రమే వినియోగిస్తున్నానని రేవంత్ పోలీసులకు తన సమాధానంలో పేర్కొన్నారు. రిజర్వేషన్లపై కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి సోషల్ మీడియాలో ఫేక్ వీడియో వైరల్ చేశారన్న ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

cm revanth reddy replies to delhi police notice on amit shah fake video

తాజాగా, ఆ నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి తరపున న్యాయవాది సౌమ్య గుప్తా వివరణ ఇచ్చారు. అమిత్ షా నకిలీ వీడియో షేర్ వెనుక తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనకు ఐఎన్‌సీ తెలంగాణ ట్విట్టర్ ఖాతాకు సంబంధం లేదన్నారు. రేవంత్ రెడ్డి సమాధానాన్ని ఢిల్లీ పోలీసులకు అందజేసినట్లు లాయర్ సౌమ్య గుప్తా తెలిపారు.

సీఎంకు నాలుగు వారాల గడువు కావాలి

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా వీడియో మార్ఫింగ్​ కేసులో ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై పీసీసీ లీగల్​ సెల్​ నేతలు వివరణ ఇచ్చారు. లోక్​‌సభ ఎన్నికల ప్రచారంలో స్టార్​ క్యాంపెయినర్​ అయిన సీఎం రేవంత్​ రెడ్డి తీరిక లేకుండా ఉన్నందున నాలుగు వారాల గడువు కావాలని ఢిల్లీ పోలీసులను కోరినట్లు లీగల్​ సెల్ నాయకులు తెలిపారు. అమిత్​ షా వీడియో మార్ఫింగ్​ కేసులో ఇటీవలే గాంధీభవన్​లో పోలీసులు నోటీసులిచ్చారు. రేవంత్​ రెడ్డి సహా పీసీసీ సోషల్ మీడియా ఛైర్మన్​ మన్నె సతీశ్​, నవీన్, శివకుమార్​, అస్మా తస్లీమ్​‌కి ఢిల్లీ పోలీసులు నోటీసులు అందించారు.

అయితే సాంకేతికపర అంశాలని పూర్తిస్థాయిలో పరిశీలన చేయాల్సి ఉన్నందున లీగల్​ సెల్​ ఛైర్మన్​ మన్నే సతీశ్​, మరో ముగ్గురికి రెండు వారాలు గడువు కావాలని కోరినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్​ రెడ్డి లోక్‌​సభ ఎన్నికల్లో స్టార్​ క్యాంపెయినర్​గా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం చేస్తున్నందున నేడు విచారణకు రాలేరని తెలిపారు. సీఎం విచారణకు హాజరయ్యేందుకు నాలుగు వారాల గడువు కావాలని కోరినట్లు కాంగ్రెస్ లీగల్​ సెల్​ ఇంఛార్జ్ రామచంద్రారెడ్డి తెలిపారు.

ఆమె ఫోన్ సీజ్

మరోవైపు, కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్ గీత ఫోన్ ను ఢిల్లీ పోలీసులు సీజ్ చేశారు. సికింద్రాబాద్ శాంతినగర్ కు చెందిన గీతకి సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులిచ్చారు. మే 5న తమ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+