ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవు.. విద్యార్థులకు, తల్లిదండ్రులకు సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు శుభవార్త చెప్పారు. విద్యా విధానంలో కీలక మార్పులు తీసుకొస్తున్నామని పేర్కొన్న రేవంత్ రెడ్డి పదవతరగతి పరీక్షల పైన ఊహించని శుభవార్త చెప్పారు. తాజాగా మీడియాతో చిట్ చాట్ లో భాగంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విద్యావ్యవస్థలో సమగ్ర మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా వెల్లడించారు. ముఖ్యంగా పదవ తరగతి పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

టెన్త్ పరీక్షలను రద్దు చేసే దిశగా ఆలోచనలు

ఇకపై సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించే టెన్త్ పరీక్షలను రద్దు చేసే దిశగా తమ ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం అమలులో ఉన్న పరీక్ష విధానం విద్యార్థుల పైన తీవ్ర ఒత్తిడిని పెంచుతుందని, దీనిని తగ్గించడం కోసమే సరికొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుందని ఆయన అన్నారు.

cm revanth reddy said scrapping 10th exams introducing a unified edu system from Nursery to 12class

12వ తరగతి వరకు ఒకే విధమైన విద్యా విధానం

నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధమైన విద్యా విధానాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విధానంలో నిరంతర మూల్యాంకనానికి ప్రాధాన్యత ఇస్తామని, ఒక్కసారి పరీక్షలు పెట్టే బదులు, సంవత్సరమంతా విద్యార్థుల ప్రతిభను అంచనా వేయడానికి కృషి చేస్తామని అన్నారు.

బోధనలో మరింత నాణ్యతను పెంచే చర్యలు

ఈ కొత్త విధానంలో విద్యార్థులు ప్రాక్టికల్ నాలెడ్జ్ , నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి దృష్టి సారించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలిపారు. ఈ ప్రయత్నం ద్వారా ఉపాధ్యాయుల పాత్రను మరింత బలోపేతం చేసి, బోధనలో మరింత నాణ్యతను పెంచే చర్యలు చేపడతామన్నారు. ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలకు అనుగుణంగా తెలంగాణ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడం లక్ష్యంగా పనిచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

అందరి అభిప్రాయాలను తీసుకుని నిర్ణయం

అయితే ఈ ప్రతిపాదన పైన అందరి అభిప్రాయాలు తీసుకుంటామని, ముఖ్యంగా తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యా నిపుణుల అభిప్రాయాలను తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పూర్తిస్థాయి అధ్యయనం చేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఈ మార్పులు అమలులోకి వస్తే విద్యారంగంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+