చంద్రబాబుతో రిలేషన్స్‌పై తేల్చేసిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపించింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఎన్నికల ప్రచారానికి ఈ సాయంత్రం తెర పడనుంది. బహిరంగ సభలు, రోడ షోల్లో తలమునకలైన అన్ని పార్టీల నాయకులు ఇక పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించనున్నారు.

ఈ పరిణామాల మధ్య ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. పలు అంశాలపై మాట్లాడారు. ఏపీ ఎన్నికలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారం, చంద్రబాబు నాయుడితో ఉన్న సంబంధాలు, ఆ రాష్ట్ర రాజకీయాల గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు.

CM Revanth Reddy suggested his AP s counterpart YS Jagan to focus on his family issues

కడపలో నిర్వహించిన రోడ్ షో సందర్భంగా వైఎస్ జగన్ తనపై చేసిన విమర్శలు, ఆరోపణలను రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. జగన్ విమర్శల్లో అర్థం లేదని వ్యాఖ్యానించారు. అన్నింటికంటే ముందుగా కన్న తల్లి, సొంత చెల్లి అడుగుతున్న ప్రశ్నలకు జగన్ సమాధానాలను ఇవ్వాలని సూచించారు.

జగన్ మాటలను కన్న తల్లి, సొంత చెల్లెలే నమ్మట్లేదని, జగన్ తనపై ఎలాంటి ఆరోపణ చేసినా దానికి ఏ మాత్రం విలువ లేదని రేవంత్ రెడ్డి అన్నారు. చిన్నాన్నకు జరిగిన ఘటనపై సొంత చెల్లెలు అడుగుతున్న ప్రశ్నలు వాళ్ల కుటుంబ విషయమే అయినప్పటిెకీ- రాజకీయ వేదికల మీద చర్చ జరుగుతోందని, దీనిపై దృష్టి పెట్టాలని అన్నారు.

తాను నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీకి విధేయుడినేనని రేవంత్ రెడ్డి అన్నారు. కొందరితో ఉన్న వ్యక్తిగత సంబంధాలతో రాజకీయాలకు ముడిపెట్టకూడదని చెప్పారు. చంద్రబాబు నాయుడు అంటే తనకు గౌరవం ఉంది తప్ప రాజకీయంగా ఎలాంటి సంబంధాలు లేవని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.

చంద్రబాబు, తెలుగుదేశం పార్టీతో ఉన్న సంబంధాలను తెంచుకుని 2017 అక్టోబర్ 31వ తేదీన తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఏపీలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారని, అక్కడ పార్టీని గెలిపించడానికి తనవంతు సహాయ, సహకారాలు ఉంటాయని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+