తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. నేడు లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు..!

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ వస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ తో పాటు తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి సన్న బియ్యం పంపిణీ.. తదితర సంక్షేమ పథకాలతో రేవంత్ ప్రభుత్వం దూసుకెళ్తోంది. ఇక తెలంగాణలోని పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాల్లో ఇందిరమ్మ ఇళ్లు ఒకటి. తాజాగా ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా వీలైనన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి అర్హులైన పేదలకు అందించాలని ఈ మేరకు కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో లబ్ధిదారుల ఖాతాల్లో ఇవాళ నగదును జమ చేయనుంది.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తుండటంతో జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేపట్టాలని భావిస్తోంది. ఈ మేరకు కసరత్తులు చేస్తోంది. జూన్ 2 తేదీకి ఇంకా వారం రోజులే గడువు ఉన్న నేపథ్యంలో శ్లాబ్ లు, గోడలు నిర్మాణాలు వేగంగా పూర్తిచేసి ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల అకౌంట్ లో నగదు జమ చేయనుంది. ఇందుకోసం రూ.13 కోట్లు విడుదల చేయనున్నట్లు సమాచారం.

Take a Poll

జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సాధ్య మైనన్ని ఎక్కువ గృహాలను ఆ రోజు సీఎం రేవంత్‌రెడ్డి, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం మలేషియా టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు సమాచారం. కేవలం 15 రోజుల్లోపే రూ.5 లక్షలతో ఇంటి నిర్మాణం ఈ టెక్నాలజీతో పూర్తి అవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అల్యూమినియం ఫోమ్ వర్క్ టెక్నాలజీ ద్వారా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

CM Revanth Reddy to Distribute Indiramma Houses on June 2

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు నిర్మించి ఇస్తామని రేవంత్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు రూ. 5 లక్షలు అందిస్తారు. ఉద్యమకారులకు 250 చదరపు గజాలు ఇంటి స్థలం అందిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+