ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ చేతుల మీదుగా..
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్లు పథకం ప్రారంభం కానుంది. లబ్ధిదారులతో కలిసి స్వయంగా సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. దీంతో ఇల్లు కోసం ఎదురు చూసే వారికి కష్టాలు తీరనున్నాయి.
సొంతగూడు కోసం నిరీక్షిస్తున్న రాష్ట్రంలోని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో మరో కీలక ముందడుగుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభోత్సవానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేదికగా నిలవబోతోంది. లబ్ధిదారులతో కలిసి స్వయంగా సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో ఈ పథకం ప్రారంభం కాబోతోంది. గ్రామంలోని లబ్ధిదారులతో కలిసి స్వయంగా సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

"సొంత ఇల్లు అంటే.. ఇటుకల గోడలు, సిమెంటు శ్లాబులు కాదు.. పేదల ఆత్మగౌరవం.. ఆ ఆత్మగౌరవాన్ని వారికి అందించే.. ప్రయత్నమే ప్రజా ప్రభుత్వం తలపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం.. సొంత ఇంటి గృహ ప్రవేశమంటే.. అది పేదల ఆత్మగౌరవ ఉత్సవం.. వారి ఆత్మబంధువుగా.. నేడు నేను వారి గృహ ప్రవేశానికి.. అతిథిగా వెళుతున్నాను. ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగుతుండగా, నారాయణపేట జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 18,344 ఇళ్లకు 9,726 ఇళ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. మొట్టమొదటగా పథకం ప్రారంభానికి కేంద్రంగా నిలుస్తున్న బెండా పాడు గ్రామానికి 310 ఇళ్లు మంజూరు అయ్యాయి" అని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
సొంత ఇల్లు అంటే…
— Revanth Reddy (@revanth_anumula) September 3, 2025
ఇటుకల గోడలు,
సిమెంటు స్లాబులు కాదు…
పేదల ఆత్మగౌరవం.
ఆ ఆత్మగౌరవాన్ని వారికి అందించే
ప్రయత్నమే ప్రజా ప్రభుత్వం తలపెట్టిన
“ఇందిరమ్మ ఇళ్ల” పథకం.
సొంత ఇంటి గృహ ప్రవేశమంటే…
అది పేదల ఆత్మగౌరవ ఉత్సవం.
వారి ఆత్మబంధువుగా
నేడు నేను వారి గృహప్రవేశానికి
అతిథిగా… pic.twitter.com/Iz1njf9Hof
అలాగే బెండాలపాడులో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలు చేసిన తర్వాత జిల్లాల్లోనూ మంత్రులు, ప్రజాప్రతినిధులు పూర్తయిన ఇళ్లను ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications