పదవులు ఇక వారికే - తేల్చేసిన రేవంత్..!!

ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖరారు తరువాత ఇతర పదవులు.. మంత్రివర్గ విస్తరణ పైన ప్రస్తుతం పార్టీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోం ది. ఇదే సమయంలో సీఎం రేవంత్ ఢిల్లీలో పార్టీ నాయకత్వంతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ సమావేశాల వేళ రేవంత్ ఢిల్లీ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది. ఈ సమయంలో రేవంత్ పార్టీ హైకమాండ్ తో తనకు ఉన్న అనుబంధం.. పార్టీలో భవిష్యత్ పదవుల ఖరారు పైన స్పష్టత ఇచ్చారు.

వారికి పదవులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు రానివారికి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని హామీ ఇచ్చానని.. అవన్నీ ఇప్పుడు అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేసారు. పార్టీ అనుబంధ విభాగాల్లో పని చేసిన వారికి ఒకే సారి 37 కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చామని చెప్పుకొచ్చారు. అలాగే అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్‌కు ఎమ్మెల్సీ ఇచ్చామని గుర్తు చేసారు. డీసీసీ అధ్యక్షులందరికీ పదవులు ఇచ్చామని తెలిపారు. గాంధీ కుటుం తో తనకు అనుబంధం అంతకు మించి ఉందని..ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదని రేవంత్ తేల్చి చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో తమ వైఖరి పైన రేవంత్ మరో సారి క్లారిటీ ఇచ్చారు.

కిషన్ రెడ్డి పై విమర్శలు
కేంద్ర కేబినెట్‌లో ఉన్న నిర్మలా సీతారామన్ గతంలో తమిళనాడుకు మెట్రో ప్రకటనలో కీలక పాత్ర పోషించారని రేవంత్ చెప్పుకొచ్చారు. తెలంగాణ అంశాల్లో మాత్రం కిషన్ రెడ్డి పట్టించు కోవటం లేదని విమర్శించారు. మామునూరు ఎయిర్‌పోర్టుకు 253 ఎకరాల భూసేకరణ పూర్తి చేస్తామన్నారు. మెట్రో, మూసీ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతిస్తే సరిపోతుందని.. బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. తెలంగాణలో ఏప్రిల్‌ నెలలో మూడు రోజుల పాటు భారత్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 60 దేశాల నుంచి అతిథులను ఆహ్వానిస్తున్నట్లు రేవంత్ వెల్లడించారు.

cm-revanth-reveals-says-party-consider-committed-leaders-in-allocating-posts-in-govt

డీ లిమిటేషన్ పైన
ఈ సమావేశ నిర్వహణ కోసం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి అనుమతి కావాలని.. అందుకే విదేశాంగ శాఖ మంత్రిని కలుస్తున్నట్లు తెలిపారు. డీలిమిటేషన్ విధానంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానారెడ్డి నేతృత్వంలో కమిటీ వేశానన్నారు. దానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఆహ్వానిస్తున్నామన్నారు. తెలంగాణలో అందరి అభిప్రాయాన్ని సేకరించి ఆ తర్వాత డీఎంకే మీటింగ్‌లో తమ వైఖరి చెబుతామని వెల్లడించారు. బీఆర్ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ఇటు అసెంబ్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన సీఎం రేవంత్ ఆరా తీసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+