మహిళలకు కొత్త వరం ప్రకటించిన సీఎం రేవంత్..!!

మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దటమే తమ ప్రభుత్వం లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ వెల్లడించారు.తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నామని తెలి పారు. రాష్ట్రం వచ్చి పదేళ్లు అయినా ఆకాంక్షలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి.. ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు క్యూ ఆర్ కోడ్ తో కూడిన ప్రత్యేక కార్డులు అందజేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వివరించారు.

మహిళల కోసం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల వేళ సీఎం రేవంత్ కీలక ప్రకటన చేసారు. జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యఅతిథిగా జపాన్‌లోని కితాక్యూషూ సిటీ మేయర్‌ టేకుచి పాల్గొన్నారు. దశాబ్దాల పోరాటంతో తెలంగాణను సాధించుకున్నామని ఉద్ఘాటించారు. సకల జనుల ఆకాంక్షలు నెరవేరిన రోజు అని అభివర్ణించారు. తాము అధికారం చేపట్టే నాటికి వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నాయని వెల్లడించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఆడబిడ్డలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తు న్నామని స్పష్టం చేశారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని గుర్తుచేశారు. ధాన్య ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్‌ వన్‌‌గా ఉందని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంలో రైతులకు ఉపయోగపడేలా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ధరణి కొందరికి చుట్టమైతే.. భూభారతి ప్రజలకు రక్షణ చట్టమని మఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

cm-revanth-says-that-his-government-is-committed-to-the-economic-growth-of-the-state-under-the-sloga

పునర్నిర్మాణం

తాము బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందని రేవంత్ గుర్తు చేసారు. వ్యవ స్థలన్నీ నిర్వీర్యమ య్యాయన్నారు. జరిగిన తప్పిదాలను సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సి న బాధ్యత తమ పై ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలనే ప్రజా ప్రభుత్వ ఎజెండాగా తెలంగాణ పునర్నిర్మాణం దిశగా ప్రయత్నిస్తూ ముందుకు కదిలామని వివరించారు. పాఠశాలల్లో మౌళిక సదుపాయాలను కల్పించే పనులను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించామని చెప్పారు. దేశం లో అదానీ, అంబానీలతో పోటీ పడేలా మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయించాం. పెట్రోల్ బంకులు, పాఠశాలల నిర్వహణ, యూనిఫాంల కుట్టు పనితో పాటు మహిళా శక్తి క్యాంటీన్లను నిర్వహించేలా మహిళలను ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడిం చారు. మహిళా సంఘాల ద్వారా 600 బస్సలు కొనుగోలు చేయించి.. ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే ఆలోచన చేశామని చెప్పారు.

హామీలు నెరవేరుస్తాం
బస్సులను వారికి అందజేసి రాష్ట్ర ఆర్థిక నిర్మాణంలో మహిళలను భాగస్వాములను చేస్తున్నామని వివరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నట్లు గుర్తు చేసారు. మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి ఏడాదిలోనే రూ.21వేల కోట్లు సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశామని చెప్పుకొచ్చారు. స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు ప్రతీ సంవత్సరం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ వివరాలతో పాటు పూర్తి వివరాలను ఆ కార్డులో పొందుపరుస్తామని వెల్లడించారు. మెరుగైన విద్య వ్యవస్థ ఏర్పాటుకు సమగ్ర విధానాన్ని రూపొం దించాలని కమిషన్ ను ఆదేశించామని రేవంత్ వివరించారు. తొలి దశలో రూ.11,600 కోట్లతో 58 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+