టాలీవుడ్‌కి బిగ్ షాక్.. 20 శాతం వాటా.. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్ !!

ప్రపంచ సినీ పరిశ్రమకు హైదరాబాద్‌ నగరం వేదిక కావాలనేది తన సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు సినీ కార్మికుల సమాఖ్య ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ కార్మికులు రేవంత్ రెడ్డికి సన్మానం చేశారు. ఐటీ, ఫార్మా రంగాల మాదిరిగా ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలనేదే తమ సంకల్పమని చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సినీ నిర్మాత దిల్ రాజు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఫిల్మ్ టెక్నీషియన్ల ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

హైదరాబాద్‌కు హాలీవుడ్‌..

( టాలీవుడ్ ) మీరు అండగా ఉంటే హాలీవుడ్‌ను హైదరాబాద్‌కు తీసుకువస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రామోజీ ఫిల్మ్‌సిటీ, ఫ్యూచర్ సిటీ వంటి ప్రదేశాలు ప్రపంచ స్థాయి షూటింగ్ హబ్‌లుగా మారాలన్నారు. అంతేకాకుండా హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ స్కూల్ స్థాపనకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రపంచ సినిమాలు హైదరాబాద్‌లో షూట్ చేసేలా మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

cm-revanth-shocking-comments-at-felicitation-ceremony-by-film-workers

ఒకప్పుడు తెలుగు సినిమా అంటే మద్రాసే గుర్తుకు వచ్చేదని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్‌కు తరలించడంలో మర్రి చెన్నారెడ్డి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి మహనీయులు చేసిన కృషి అపారమైనదని కొనియాడారు. నేడు తెలుగు సినిమాలు ఆస్కార్‌ వరకు చేరగలిగాయని.. ఈ గౌరవం తెర వెనుక కష్టపడే సినీ కార్మికుల శ్రమ ఫలితమని సీఎం అన్నారు. అంతేగాకుండా చిత్రపురి కాలనీ వంటి ప్రాంతాలు ప్రపంచ సినీ మ్యాప్‌లో గుర్తింపు పొందాయని చెప్పారు. ఈ వారసత్వాన్ని నిలబెట్టడం మనందరి బాధ్యత అని గుర్తు చేశారు.

రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పదేళ్ల పాటు నిలిచిపోయిన నంది అవార్డులను పునరుద్ధరించి.. ఇప్పుడు గద్దర్ పేరుతో కొత్త అవార్డులు ప్రారంభించామని సీఎం వెల్లడించారు. కళాకారుల కృషిని గుర్తించి గౌరవించడమే ఈ అవార్డుల ఉద్దేశ్యమని.. ప్రతి కళాకారుడు గర్వపడే వేదికగా తెలంగాణ నిలుస్తుందని ఆయన అన్నారు.

సినీ కార్మికుల పిల్లలకు స్కూల్..

సినీ కార్మికుల సంక్షేమంపై పలు కీలక నిర్ణయాలు ముఖ్యమంత్రి ప్రకటించారు. కృష్ణానగర్‌లో మూడు నుంచి నాలుగు ఎకరాలలో కార్పొరేట్ స్థాయి పాఠశాల నిర్మిస్తామన్నారు. సినీ కార్మికుల పిల్లలకు నర్సరీ నుండి ఇంటర్‌ వరకు ఉచిత విద్య అందిస్తామని తెలిపారు. ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం కూడా అందిస్తామని సీఎం తెలిపారు. అంతేకాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్మికుల కుటుంబాలకు ఉచిత వైద్యం కూడా అందేలా చూస్తామన్నారు.

వెల్ఫేర్ ఫండ్‌కు రూ.10 కోట్లు..

సినీ కార్మికుల సంక్షేమ నిధి కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు డిపాజిట్ చేస్తుందని సీఎం ప్రకటించారు. సినిమా టికెట్ల ధరలు పెంచాలంటే నిర్మాతలు ఆ పెరిగిన ఆదాయంలో 20 శాతం భాగాన్ని కార్మికులకు ఇవ్వాలని ప్రకటించారు. ఆ మొత్తాన్ని వెల్ఫేర్ ఫండ్‌లో జమ చేయాలని.. అలా చేయనిదే టికెట్ ధరల పెంపుకు జీఓ ఇవ్వం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే సినీ ఫైటర్స్‌, టెక్నీషియన్ల నైపుణ్య అభివృద్ధికి ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలు..

సినీ కార్మికుల గృహ అవసరాలను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే ప్రత్యేక హౌసింగ్ ప్రాజెక్ట్‌ చేపడతామని సీఎం తెలిపారు. ప్రభుత్వం మీ వెన్నంటి ఉంటుందని.. ఇళ్ల స్థలాలు కేటాయించి, రుణ సౌకర్యాలు అందిస్తామని హామీ ఇచ్చారు. . మీరు కష్టపడే ప్రతీసారి ప్రభుత్వం మీతో ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+