సీఎం రేవంత్ సంచలన నిర్ణయం - హైదరాబాద్ నడి బొడ్డున..!!
ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటనకు సిద్దం అవుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ రేపు (సోమ వారం) ప్రత్యేకంగా సమావేశం కానుంది. మాజీ ప్రధాని మన్మోహన్ కు నివాళి అర్పించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసారు. ఇక, ఇదే చర్చ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ దివంగత ప్రధాని మన్మోహన్ పేరుతో హైదరాబాద్ నడిబొడ్డున స్మృతి ఏర్పాటుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని పైన అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
మాజీ ప్రధానికి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై నివాళి అర్పించనుంది. మన్మోహన్ అంత్యక్రియల్లో పాల్గొన్న సీఎం రేవంత్ ఆ వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం సభలో మన్మోహన్ చేసిన సేవలను ప్రస్తావించనున్నారు. పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రధానిగా మన్మోహన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. దేశ ఆర్దిక రంగాన్ని గాడిన పెట్టటంలో కీలక పాత్ర పోషించారు. ఇక, మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో హైదరాబాద్ విమానాశ్రయం, ఓఆర్ఆర్, మెట్రో విస్తరణ పైన వేగంగా నిర్ణయాలు జరిగాయి.

ఇక, మన్మోహన్ చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోయే వ్యక్తి కావటంతో..ఆయన కు గుర్తుగా సీఎం రేవంత్ కీలక నిర్ణయానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. మన్మోహన్ స్మృతిగా సచివాలయం సమీపంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అదే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో త్వరలో ప్రారంభించే స్కీం కు మన్మోహన్ పేరుతో కొనసాగించేలా ప్రకటన చేయనున్నారు. ప్రస్తుతం ఇందిరా, రాజీవ్ విగ్రహాలు తరహాలోనే మన్మోహన్ విగ్రహం సైతం ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. అసెంబ్లీ వద్ద మన్మోహన్ విగ్రహం ఏర్పాటు పైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications