సీఎం రేవంత్ కీలక ప్రకటన - కేసీఆర్ కు చెక్..!!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో రాజకీయంగా ఈ సమావేశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ రోజు జరిగే బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు సభ నిర్వహించాలి.. అజెండా పైన నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి ఈ రోజు సభలో కీలక ప్రకటనకు సిద్దమయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పైన స్పష్టత ఇవ్వనున్నారు. కేసీఆర్ లక్ష్యంగా రేవంత్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఈ సమావేశాల్లోనే రైతు భరోసా పైన రేవంత్ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
సభ వేదికగా రేవంత్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేదికగా రేవంత్ తన తొలి ఏడాది పాలన విజయాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. మాజీ సీఎం కేసీఆర్ .. బీఆర్ఎస్ లక్ష్యంగా రేవంత్ రాజకీయంగా దూకుడుగా వెళ్లాలని డిసైడ్ అయ్యారు. పదేళ్ల కాలంలో కేసీఆర్ ప్రజలకు మేలు చేయలేదని.. తన హయాంలో తీసుకున్న నిర్ణయాలను రంగాల వారీగా సభ నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఇక, ఈ రోజు సభలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ గురించి రేవంత్ వివరించనున్నారు. తెలంగాణ తల్లి నమూనా పైన వస్తున్న విమర్శలకు సమాధానం ఇవ్వనున్నారు. అదే విధంగా భారీ సభ లో విగ్రహావిష్కరణకు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి రావాలని ఇప్పటికే కేసీఆర్, కేంద్ర మంత్రుల తో సహా పలువురు ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానించింది.

కేసీఆర్ పై గురి
అటు మాజీ సీఎం కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలకు సభలో వ్యవహరించాల్సిన తీరు పైన దిశా నిర్దేశం చేసారు. తెలంగాణ తల్లి విగ్రహ నమూనా పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సారి సమావేశాల్లోనే ప్రభుత్వం రైతు భరోసా అమలు పైన మంత్రివర్గ ఉప సంఘం సిద్దం చేసిన నివేది కను సభలో ప్రవేశ పెట్ట నుంది. అన్ని పార్టీల నుంచి అభిప్రాయాలు స్వీకరించి.. సభలో చర్చ తరువాత అముల పైన తుది నిర్ణయం తీసుకోనుంది. సంక్రాంతి తరువాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఇప్పటికే రేవంత్ ప్రకటించారు. అదే విధంగా ఈ సారి సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రతిపాదించనుంది. నూతన ఆర్వోఆర్ చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు.
సభలో కీలక బిల్లుల
వైద్యవిధాన పరిషత్తును ప్రభుత్వంలో విలీనం చేసి సెకండరీ హెల్త్ డైరెక్టరేట్‌గా మార్చే బిల్లును సైతం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మొదటి రోజున కొత్త బిల్లుల ఆమోదం కోసం ప్రభుత్వం సభలో
జీతాలు, పింఛన్ల చెల్లింపు, అనర్హతల తొలగింపు (సవరణ) ఆర్డినెన్స్ 2024 ను ప్రవేశ పెట్టనుం ది. తెలంగాణ పురపాలక సంఘాల (సవరణ) ఆర్డినెన్స్ 2024 ను సభ ముందుకు తీసుకువచ్చే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ వస్తువుల, సేవల పన్ను (సవరణ) ఆర్డినెన్స్ 2024 ను సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరై సూచనలు ఇవ్వాలని ప్రభుత్వం సూచన చేసింది. అయితే, కేసీఆర్ హాజరయ్య అవకాశాలు లేవని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications