ఉమెన్స్ డే వేళ సీఎం రేవంత్ ఊహించని కానుక..!!
మహిళా దినోత్సవం వేళ సీఎం రేవంత్ కీలక ప్రకటన చేసారు. భారీ కానుక ప్రకటించారు. తమ ప్రభుత్వం మహిళల కోసం అనేక నిర్ణయాలు అమలు చేస్తుందని చెప్పారు. మహిళాభ్యున్నతి కోసం తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఉక్కు మహిళ సోనియా కారణంగానే తెలంగాణ కల సాకారం అయిందని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వంలో మహిళలే కీలక శాఖలకు మంత్రులుగా... శాఖాధిపతులుగా వ్యవహరిస్తున్నారని వివరించారు. మూసీ ప్రాజెక్టు లక్ష్యాలను రేవంత్ వివరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ మహిళా దినోత్సవం వేళ కీలక ప్రకటన చేసారు. మహిళలకు ఉపయోగపడే లా త్వరలో పలు పథకాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థినులకు ఉచితంగా స్కూటీలు అందించే పథకం పైన స్పష్టత ఇచ్చారు. ఎలక్ట్రిక్ బస్సులపైనా కీలక అంశాలను ప్రస్తావించారు. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన మహిళల్ని ప్రభుత్వం సత్కరించింది. ఇదే సమయంలో విద్యార్థినులకు త్వరలో ఉచితంగా ప్రభుత్వ తరపున ఎలక్ట్రిక్ స్కూటీలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. కాగా, మూసీ అంశం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. మూసీ ప్రక్షాళనకు ప్రతిపక్షాలు అనుకూలమా..కాదా అని ప్రశ్నించారు. నదుల బఫర్ జోన్లలో కట్టడాలకు అనుమతు లు లేవని చెప్పారు. బఫర్ జోన్‌లో నిర్మాణాలు చేపడితే తొలగించాలన్నారు. బఫర్ జోన్ పరిధిలోని ఇళ్లకు విలువ ఉండదని స్పష్టం చేసారు. ఇలాంటి అంశాలపై రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. నష్టపోయేవారికి ఏం ఇవ్వాలనే దానిపై చర్చించాల్సిన అవసరం ఉందని రేవంత్ పేర్కొన్నారు.

మహిళల కోసం ప్రత్యేక నిర్ణయాలు
కాగా, హైదరాబాద్‌కు కాలుష్యమే అతిపెద్ద సమస్యగా పేర్కొన్న రేవంత్... హైదరాబాద్ నాన్ లివింగ్ సిటీగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాలుష్యం నివారించే బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీపడేలా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు బయటకు పరిశ్రమలను తరలించాలని... 2026 డిసెంబర్ నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులతో సహా... పెట్రోల్, డీజిల్ ఆటోలనూ ఎలక్ట్రిక్‌గా మార్చుతామని ప్రకటించారు. త్వరలోనే విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని వెల్లడించారు మహిళలు ఉన్నత స్థానాల కు చేరుకోవాలన్నారు. వారి కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పిన సీఎం రేవంత్... డ్వాక్రా సంఘాల ద్వారా రుణం అందిస్తున్నామని, గృహలక్షి పథకం ద్వారా సబ్సిడీకి గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు మహిళలు ఆర్ధికంగా ఎదిగేలా ప్రభుత్వం నుంచి తోడ్పాటు అందిస్తున్నామని రేవంత్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని డీజిల్ బస్సులను 2026 డిసెంబర్‌ల్లోపు జిల్లాలకు తరలిస్తామని తెలిపారు. డిసెంబర్ 9లోపు డీజిల్ బస్సులు హైదరాబాద్‌లో కనిపించవని తెలిపారు.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది?












Click it and Unblock the Notifications