• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ ఫాంహౌజ్ కోసం ప్రత్యేక సబ్ స్టేషనా?ఉచిత విద్యుత్ పేరుతో సీఎం మహా దోపిడీ.!బండి సంజయ్ ఫైర్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ పేరుతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. చంద్రశేఖర్ రావు ఫాంహౌజ్ లోనే ప్రత్యేకంగా సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేసుకుని 40 గ్రామాలకు సరిపడా కరెంట్ ను ఉచితంగా వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. బహిరంగ మార్కెట్ లో యూనిట్ కరెంట్ ధర 3 రూపాయలకు దొరుకుతుండగా, చంద్రశేఖర్ రావు మాత్రం కమీషన్లకు కక్కుర్తి పడి యూనిట్ కు 6రూపాయల చొప్పున కొంటూ ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.

 40 గ్రామాలకు అవసరమైన కరెంట్.. కేసీఆర్ ఫాంహౌస్ కోసం వాడుకుంటున్నాడన్న బండి సంజయ్

40 గ్రామాలకు అవసరమైన కరెంట్.. కేసీఆర్ ఫాంహౌస్ కోసం వాడుకుంటున్నాడన్న బండి సంజయ్


రాష్ట్రంలోని అన్ని సబ్ స్టేషన్లను తనఖా పెట్టి అప్పు తీసుకున్న చంద్రశేఖర్ రావు రాష్ట్రానికి అప్పు పుట్టకుండా చేశారని బండి సంజయ్ అన్నారు. అదానీ కంపెనీకి కట్టబెట్టేందుకే బొగ్గు దిగుమతి చేసుకుంటున్నారంటూ, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్దాలేనన్నారు బండి సంజయ్. కాలుష్యం పేరుతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని చంద్రశేఖర్ రావు ప్రభుత్వం మూసివేయించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు బీజేపీ ఛీఫ్.

 ఉద్యోగాలిప్పిస్తామని కోట్లు దండుకున్న టీఆర్ఎస్ నేతలు..రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మూసివేత పెద్ద కుట్ర

ఉద్యోగాలిప్పిస్తామని కోట్లు దండుకున్న టీఆర్ఎస్ నేతలు..రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మూసివేత పెద్ద కుట్ర


ఎరువుల ఇబ్బంది లేకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుంటే బీజేపీకి పేరొస్తుందనే అక్కసుతో ఎరువుల ఫ్యాక్టరీని మూసివేయించి రైతులకు నష్టం చేసే చర్యకు చంద్రశేఖర్ రావు పూనుకున్నారని ఆరోపించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాలిప్పిస్తానని టీఆర్ఎస్ నేతలు ఎంతోమంది యువకుల నుండి కోట్లాది రూపాయలు దండుకున్నారని సంజయ్ ఆరోపించారు. వాళ్లందరికీ ఉద్యోగాలిచ్చే పరిస్థితి లేకపోవడంతో వారంతా తిరగబడుతున్నారని గ్రహించి కాలుష్యం పేరుతో ఏకంగా ఫ్యాక్టరీనే మూసివేయించడం సిగ్గు చేటన్నారు బండి సంజయ్.

 విచ్చలవిడి దోపిడీ.. కేసీఆర్ రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయించారన్న బండి సంజయ్

విచ్చలవిడి దోపిడీ.. కేసీఆర్ రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయించారన్న బండి సంజయ్


సింగరేణిని కాపాడుకునేందుకు కార్మికులు రాత్రింబవళ్లు కష్టపడుతుంటే, వాళ్లు దాచుకున్న డిపాజిట్లను కూడా డ్రా చేసి ఆ డబ్బుతోనే కార్మికులకు జీతాలు చెల్లించే స్థాయికి చంద్రశేఖర్ రావు దిగజారారని మండిపడ్డారు. సీఎం చంద్రశేఖర్ రావు విచ్చలవిడి అవినీతితో రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిండనొ, జీతాలు, పెన్షన్ లు ఇచ్చే పరిస్థిలేదని, తెలంగాణ ఆగమాగమైందన్నారు బండి సంజయ్. ఏ రోజు ఏమైతదో తెల్వని పరిస్థితి నెలకొందని, ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసే పరిస్థితి లేదని, బయట అప్పులు కూడా పుట్టే దిక్కులేదన్నారు బీజేపి తెలంగాణ ఛీఫ్.

 మత విద్వేషాలు రెచ్చగొడుతున్నానని వక్ర భాష్యం.. వారి విజ్ఞతకే వదిలేస్తానన్న సంజయ్

మత విద్వేషాలు రెచ్చగొడుతున్నానని వక్ర భాష్యం.. వారి విజ్ఞతకే వదిలేస్తానన్న సంజయ్


అంతే కాకుండా తాను మత విద్వేషాలు రెచ్చగొడుతున్నానని చెబుతున్న కుహానా లౌకిక వాదులు 15 నిమిషాల టైమిస్తే హిందువులందరినీ చంపేస్తానన్నప్పుడు, లక్ష్మీ, దుర్గామాత, శ్రీక్రిష్ణుడు, శ్రీరాముడు వంటి హిందూ దేవుళ్లను కించపరుస్తున్నప్పుడు ఎటు పోయారని బండి సంజయ్ ప్రశ్నించారు. బైంసాలో హిందువుల ఇండ్లను తగలపెట్టినప్పుడు, జర్నలిస్టు అని కూడా చూడకుండా పేగులు బయటకు వెళ్లేదాకా పొడిచినప్పుడు, దళిత బిడ్డ నాగరాజును నరికి చంపినప్పుడు, గోవులను విచ్చలవిడిగా వధిస్తున్నప్పుడు నోరెందుకు విప్పడం లేదని నిలదీసారు.

English summary
BJP state president and MP Bandi Sanjay Kumar has lashed out at Chief Minister Kalvakuntla Chandrasekhar Rao for rampant corruption and bankruptcy in the name of 24-hour free electricity. Chandrasekhar Rao alleged that a special substation had been set up in the farm house and enough electricity was being used for 40 villages free of cost.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X