మార్కెట్‌లో తనిఖీలు: పండ్ల నమూనాల సేకరణ (ఫోటోలు)
హైదరాబాద్: గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో మరోసారి రెవెన్యూ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. నిషేధిత కాలుష్య కార్బైడ్ వాడకంపై హైకోర్టు ఆగ్రహించిన నేపథ్యంలో వారం క్రితం రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు మార్కెట్‌లో తనిఖీలు నిర్వహించి కాలుష్య కార్బైడ్ వినియోగిస్తున్న దుకాణాలను సీజ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం సరూర్ నగర్ మండలం డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. మొత్తం 40 మంది సిబ్బందితో నాలుగు బృందాలు మార్కెట్‌లోని 174 దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. అయితే ఎక్కడా కార్బైడ్ లభించలేదు.

మార్కెట్‌లో తనిఖీలు: పండ్ల నమూనాల సేకరణ
గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో మరోసారి రెవెన్యూ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. నిషేధిత కాలుష్య కార్బైడ్ వాడకంపై హైకోర్టు ఆగ్రహించిన నేపథ్యంలో వారం క్రితం రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు మార్కెట్‌లో తనిఖీలు నిర్వహించి కాలుష్య కార్బైడ్ వినియోగిస్తున్న దుకాణాలను సీజ్ చేసిన సంగతి తెలిసిందే.

మార్కెట్‌లో తనిఖీలు: పండ్ల నమూనాల సేకరణ
ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం సరూర్ నగర్ మండలం డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.

మార్కెట్‌లో తనిఖీలు: పండ్ల నమూనాల సేకరణ
మొత్తం 40 మంది సిబ్బందితో నాలుగు బృందాలు మార్కెట్‌లోని 174 దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. అయితే ఎక్కడా కార్బైడ్ లభించలేదు.

మార్కెట్‌లో తనిఖీలు: పండ్ల నమూనాల సేకరణ
కార్బైడ్ లభించకపోయినా పండ్ల నమూనాలను అధికారులు సేకరించారు. తనిఖీల నేపథ్యంలో కమిషన్ ఏజెంట్లు మార్కెట్‌లో కాకుండా వేరేచోట కార్బైడ్‌తో పండ్లను మగ్గించి వాటిని మార్కెట్‌కు తీసుకొచ్చి విక్రయించే అవకాశం ఉండవచ్చని పండ్ల శాంపిల్స్‌ను సేకరించామని డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.

మార్కెట్‌లో తనిఖీలు: పండ్ల నమూనాల సేకరణ
యాపిల్స్, దానిమ్మ, పైనాఫిల్, బత్తాయి, సపోట పండ్ల నమూనాలను సేకరించారు. తనిఖీల్లో మార్కెటింగ్ శాఖ డీడీ మల్లేశం, పుడ్ ఇన్ స్పెక్టర్ దీన్ దయాళ్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications